జీమూతవాహన - తాటిముంజల బండి
కొనసీమ లొని ఒక కుగ్రామం. అందులొ ఒక అగ్రహరం. అవి ఎంత అందమైన రొజులు అంటే , పని వాళ్ళు పని అయ్యకా డబ్బులకు బదులు ఆవకాయ ముక్కొ లేక టీ చుక్కొ అడిగే రొజులు . చేపలు,రొయ్యలు అమ్ముకొనెవాళ్ళు , అగ్రహారం పొలిమెరలొ ఉన్న కాపుల పాలెం వచ్చెదాకా వాళ్ళ సైకిల్ ఆపకుండా,అరవకుండాపొయె రొజులు.
ఆ రొజు ఊరంతా సందడిగా ఉంది. కారణం, ఆ ఊరి గారాల పట్టి, ముద్దు బిడ్డ అయిన జీమూతవాహనుడు పై చదువులకి ఆ ఊరు విడిచి వెళ్ళె రొజు. అందరు ముద్దుగా జీము అని పిలుచుకుంటారు. జీముతుడి అసలు పేరు ఉగ్రతాండవ నాగ జీమూతవాహన కుమార్. ఉగ్రతాండవం అనేది జీము కి మేనత్త మొగుడి పేరు. ఆయన బతికున్నప్పుడు ఊరి జనాల మీద తాండవం చెసేవాడు. జీము కూడ అలానే తాండవం చెయ్యాలని ఆ పేరు కలిపారు,
ఇప్పటికి అదే పేరు ఉండేది, కానీ ఒక రొజున..................... ఫ్లాష్ బ్యాక్
అప్పుడు జీము ఒకటొ తరగతి చదివే రొజులు.. ఓ రొజు బడికి బయలుదేరాడు . ఇంటి నుండి బడికి పది అంగల్లొ వెళ్ళిపొవచ్చు కాని జీముడికి తన ఊరి వాళ్ళంటె వల్లమాలిన అభిమానం. అందరిని పలకరించి కాని బడికి వెళ్ళడు.
వాళ్ళ ఇంటిపక్కన ఉండే చిన్నమ్మడక్క గారి ఇంటికి వెళ్ళి ఆవిడ పెట్టె బెల్లం టీ రొజు త్రాగితె కాని పాఠం తలకి ఎక్కదు. జీము వాళ్ళ ఇంటికి టీ కి వెళ్తె చాలు , సావిట్లొ ఉన్న స్తంభం పక్క పట్టెమంచం ఖాళి చెయ్యల్సిందే. ఆ పట్టెమంచం మీద కాళ్ళు ఎత్తిపెట్టి , స్తంభానికి ఆనుకొని టీ తాగితే కాని బడికి వెళ్ళడు.
ఆ రొజు కూడ టీ తాగేసి ఇంటి బయటకి రాగానే ఎదురుగా "నయనతారుడు" తాటి ముంజెల బండి తొసుకుంటూ వచ్చాడు. జీముని చూస్తూనే "తొందరగా ఎక్కెహే , బడికి టయాం అయిపొతొంది" అని తొందరపెట్టాడు. నయనతారుడు జీముకి వేలు విడిచిన పెదనాన్న కొడుకు , అంటే అన్నయ్య అవుతాడు, ఒ రెండెళ్ళు పెద్ద.. ఆకాశం లొ నక్షత్రాలలా విసిరెసినట్టుగా వీడి కళ్ళు ఎటెటొ ఉంటాయి కాబట్టి వీడికి నయనతారుడు అని వాళ్ళ నాన్న భీమపాదుడు గారు ఏరికొరి పెట్టారు. భీమపాదం గారికి వొంట్లొ అన్నిటికన్న పాదాలు భలంగా ఉంటాయని ఆ పేరు. .......... సరే, అసలు విషయానికి వద్దాం ...
జీము రొజులాగే ఆ తాటి ముంజెల మధ్యలొ ఉన్న కొబ్బరి కమ్మ మీద కూర్చొగానే , నయనతారుడు ఆ బండిని తొసుకుంటూ ముందుకు సాగాడు . ఎదురుగా ఎడ్ల బండి తొలుకుంటూ సత్తిగాడు, జీము బండిని చూడగానె ఎడ్లని పక్కన ఆపేసి, తలపాగ తీసుకొని చెతిలొ పెట్టుకొని, " రొడ్డుకి మూలగా వెళ్ళొద్దండి అబ్బయ్ గారు , అక్కడ బాలేదు " అని అన్నాడు. అంతలొ నయనతారుడు, మాకు తెలుసులే, అని విసురుగా బండిని తొయసాగడు. రెండు అడుగులు వేసేసరికి "టీపొడి" శంకర్రావు ఇంటి నుండి రేడియొలొ జనరంజని లొ " తెల్లా తెల్లని చీరలొన చందమామా పట్టాపగలు వచ్చినావె చందమామ" అన్న పాట మొదలయ్యింది. అది వినగానే, నయనతారుడు, ఆ పాటకి తగ్గట్టుగా ఈల వేయసాగాడు. అంతలొ వాళ్ళకి ఎదురుగా నిండుగా తెల్ల పంచ కట్టుకున్న జీముడి చిన్న నాయనమ్మ "నిత్య వర్షిణి" వస్తూ వీళ్ళని చూసి రొడ్డుకి పక్కగా ఆగిపొయింది. ఆవిడని అందరు నిత్య మామ్మ అని పిలుచుకుంటారు. ఈవిడని కదిపితె కంట్లొ లేకపొతె ముక్కు కారిపొతుంది , అందుకే నిత్యవర్షిణి అని ఈవిడకి పేరు.
నిత్యమామ్మ వీళ్ళని చూసి " ఒరేయ్ నయనగా బండి కొంచెం అస్సింట తొలు, ఈ పక్కన అంతా అశుద్దాలు ఉన్నయ్ రా " అని గెట్ఠిగా జలుబు ముక్కుతొ అరిచింది. ఆ అరుపుకి నయనతారుడికి కొపం వచ్చి " నువ్వేటెహె నాకు చెప్పెది" అని అనేసాడు. వీడితొ ఎందుకులే అనుకొని " సరేలే , నయనగా ! చెరువు గట్టు దాక వెళ్తున్నవు కదా , అక్కడ మంగలి చింతన్న ఉంటే కాస్త రమ్మన్నా అని చెప్పు. నేను పెరట్లొ ఉంటాను , చెప్తావు కదరా , నీకు కొన్ని అటుకులు పెడతాలె నాయనా" అని బతిమలాడింది. అసలే నిత్యమామ్మ మీద కొపంగా ఉన్న నయనతారుడు " నేను చెప్పను , నేను జీముడిని బళ్ళొ దిగెట్టెసి , మా నాన్న కూడ నందంపుడి వెళ్ళాలి, జమిందారు గారి మనవరాలు సవత్తాడింది , భొంజెయ్యడానికి వెళ్ళలెహె" అని ఆవేశంగా బండితొసుకుంటూ పొయాడు. వెంటనె నిత్యమామ్మ " అలానే వెళ్ళు , మీ నాన్న కూడ తిరిగి అడుక్కుతినిపొతావ్" అని శపించింది
"ఏమే పిన్ని ! ఎవడే అడుక్కుతినేది, ఈ సారి మా ఇంటికి పుల్ల మజ్జిక్కి వస్తావు కదా అప్పుడు నీ టొపెరం లెగ్గొడతా" అని గెట్టిగా వినపడేసరికి నెత్తి మీద పంచ సర్దుకొని ఎవరూ అన్నట్టుగా చూసింది నిత్యమామ్మ. నయనతారుడి నాన్న భీమపాదం ఒక చేత్తొ చెంబు పట్టుకొని ఒంటి చేత్తొ సైకిల్ తొక్కుతూ ఆవేశంగా తిట్టేసిపొయాడు. పొద్దున్నే వీడి శకునం ఎంట్రా దేవుడా, పైగా దొడ్డి చెంబూ వీడునూ అని నిత్యమామ్మ కాసెపు అక్కడే నిల్చొని , జనరంజని లొ "నీ దారి పూల దారి పొవొయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ద్వనించు విజయ భేరి" పాట వస్తుండగా , మంచి శకునం రాగానె పుల్ల మజ్జిగకొసం ఈ సారి భీమపాదం ఇంటికి కాకుండా , జీముడి ఇంటి వైపు మళ్ళింది
--> ఆ రొజు ఊరంతా సందడిగా ఉంది. కారణం, ఆ ఊరి గారాల పట్టి, ముద్దు బిడ్డ అయిన జీమూతవాహనుడు పై చదువులకి ఆ ఊరు విడిచి వెళ్ళె రొజు. అందరు ముద్దుగా జీము అని పిలుచుకుంటారు. జీముతుడి అసలు పేరు ఉగ్రతాండవ నాగ జీమూతవాహన కుమార్. ఉగ్రతాండవం అనేది జీము కి మేనత్త మొగుడి పేరు. ఆయన బతికున్నప్పుడు ఊరి జనాల మీద తాండవం చెసేవాడు. జీము కూడ అలానే తాండవం చెయ్యాలని ఆ పేరు కలిపారు,
ఇప్పటికి అదే పేరు ఉండేది, కానీ ఒక రొజున..................... ఫ్లాష్ బ్యాక్
అప్పుడు జీము ఒకటొ తరగతి చదివే రొజులు.. ఓ రొజు బడికి బయలుదేరాడు . ఇంటి నుండి బడికి పది అంగల్లొ వెళ్ళిపొవచ్చు కాని జీముడికి తన ఊరి వాళ్ళంటె వల్లమాలిన అభిమానం. అందరిని పలకరించి కాని బడికి వెళ్ళడు.
వాళ్ళ ఇంటిపక్కన ఉండే చిన్నమ్మడక్క గారి ఇంటికి వెళ్ళి ఆవిడ పెట్టె బెల్లం టీ రొజు త్రాగితె కాని పాఠం తలకి ఎక్కదు. జీము వాళ్ళ ఇంటికి టీ కి వెళ్తె చాలు , సావిట్లొ ఉన్న స్తంభం పక్క పట్టెమంచం ఖాళి చెయ్యల్సిందే. ఆ పట్టెమంచం మీద కాళ్ళు ఎత్తిపెట్టి , స్తంభానికి ఆనుకొని టీ తాగితే కాని బడికి వెళ్ళడు.
ఆ రొజు కూడ టీ తాగేసి ఇంటి బయటకి రాగానే ఎదురుగా "నయనతారుడు" తాటి ముంజెల బండి తొసుకుంటూ వచ్చాడు. జీముని చూస్తూనే "తొందరగా ఎక్కెహే , బడికి టయాం అయిపొతొంది" అని తొందరపెట్టాడు. నయనతారుడు జీముకి వేలు విడిచిన పెదనాన్న కొడుకు , అంటే అన్నయ్య అవుతాడు, ఒ రెండెళ్ళు పెద్ద.. ఆకాశం లొ నక్షత్రాలలా విసిరెసినట్టుగా వీడి కళ్ళు ఎటెటొ ఉంటాయి కాబట్టి వీడికి నయనతారుడు అని వాళ్ళ నాన్న భీమపాదుడు గారు ఏరికొరి పెట్టారు. భీమపాదం గారికి వొంట్లొ అన్నిటికన్న పాదాలు భలంగా ఉంటాయని ఆ పేరు. .......... సరే, అసలు విషయానికి వద్దాం ...
జీము రొజులాగే ఆ తాటి ముంజెల మధ్యలొ ఉన్న కొబ్బరి కమ్మ మీద కూర్చొగానే , నయనతారుడు ఆ బండిని తొసుకుంటూ ముందుకు సాగాడు . ఎదురుగా ఎడ్ల బండి తొలుకుంటూ సత్తిగాడు, జీము బండిని చూడగానె ఎడ్లని పక్కన ఆపేసి, తలపాగ తీసుకొని చెతిలొ పెట్టుకొని, " రొడ్డుకి మూలగా వెళ్ళొద్దండి అబ్బయ్ గారు , అక్కడ బాలేదు " అని అన్నాడు. అంతలొ నయనతారుడు, మాకు తెలుసులే, అని విసురుగా బండిని తొయసాగడు. రెండు అడుగులు వేసేసరికి "టీపొడి" శంకర్రావు ఇంటి నుండి రేడియొలొ జనరంజని లొ " తెల్లా తెల్లని చీరలొన చందమామా పట్టాపగలు వచ్చినావె చందమామ" అన్న పాట మొదలయ్యింది. అది వినగానే, నయనతారుడు, ఆ పాటకి తగ్గట్టుగా ఈల వేయసాగాడు. అంతలొ వాళ్ళకి ఎదురుగా నిండుగా తెల్ల పంచ కట్టుకున్న జీముడి చిన్న నాయనమ్మ "నిత్య వర్షిణి" వస్తూ వీళ్ళని చూసి రొడ్డుకి పక్కగా ఆగిపొయింది. ఆవిడని అందరు నిత్య మామ్మ అని పిలుచుకుంటారు. ఈవిడని కదిపితె కంట్లొ లేకపొతె ముక్కు కారిపొతుంది , అందుకే నిత్యవర్షిణి అని ఈవిడకి పేరు.
నిత్యమామ్మ వీళ్ళని చూసి " ఒరేయ్ నయనగా బండి కొంచెం అస్సింట తొలు, ఈ పక్కన అంతా అశుద్దాలు ఉన్నయ్ రా " అని గెట్ఠిగా జలుబు ముక్కుతొ అరిచింది. ఆ అరుపుకి నయనతారుడికి కొపం వచ్చి " నువ్వేటెహె నాకు చెప్పెది" అని అనేసాడు. వీడితొ ఎందుకులే అనుకొని " సరేలే , నయనగా ! చెరువు గట్టు దాక వెళ్తున్నవు కదా , అక్కడ మంగలి చింతన్న ఉంటే కాస్త రమ్మన్నా అని చెప్పు. నేను పెరట్లొ ఉంటాను , చెప్తావు కదరా , నీకు కొన్ని అటుకులు పెడతాలె నాయనా" అని బతిమలాడింది. అసలే నిత్యమామ్మ మీద కొపంగా ఉన్న నయనతారుడు " నేను చెప్పను , నేను జీముడిని బళ్ళొ దిగెట్టెసి , మా నాన్న కూడ నందంపుడి వెళ్ళాలి, జమిందారు గారి మనవరాలు సవత్తాడింది , భొంజెయ్యడానికి వెళ్ళలెహె" అని ఆవేశంగా బండితొసుకుంటూ పొయాడు. వెంటనె నిత్యమామ్మ " అలానే వెళ్ళు , మీ నాన్న కూడ తిరిగి అడుక్కుతినిపొతావ్" అని శపించింది
"ఏమే పిన్ని ! ఎవడే అడుక్కుతినేది, ఈ సారి మా ఇంటికి పుల్ల మజ్జిక్కి వస్తావు కదా అప్పుడు నీ టొపెరం లెగ్గొడతా" అని గెట్టిగా వినపడేసరికి నెత్తి మీద పంచ సర్దుకొని ఎవరూ అన్నట్టుగా చూసింది నిత్యమామ్మ. నయనతారుడి నాన్న భీమపాదం ఒక చేత్తొ చెంబు పట్టుకొని ఒంటి చేత్తొ సైకిల్ తొక్కుతూ ఆవేశంగా తిట్టేసిపొయాడు. పొద్దున్నే వీడి శకునం ఎంట్రా దేవుడా, పైగా దొడ్డి చెంబూ వీడునూ అని నిత్యమామ్మ కాసెపు అక్కడే నిల్చొని , జనరంజని లొ "నీ దారి పూల దారి పొవొయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ద్వనించు విజయ భేరి" పాట వస్తుండగా , మంచి శకునం రాగానె పుల్ల మజ్జిగకొసం ఈ సారి భీమపాదం ఇంటికి కాకుండా , జీముడి ఇంటి వైపు మళ్ళింది
అయిపొలేదు…..
వూరికేచదివేసి window ని close చెయ్యకుండా , comments రాయాల్సిందిగా మనవి
adurs
ReplyDelete"చేపలు రొయ్యలు అమ్ముకొనేవాళ్ళు అగ్రహారం పొలిమేరలో ఉన్న కాపులపాలెం వచ్చేదాకా వాళ్ళ సైకిల్ ఆపకుండా, అరవకుండా పోయే రోజులు." - భేషో భేషు. ఎంచగ్గా రాస్తున్నారు. కోనసీమ చూస్తున్నట్టే ఉంది. మొదటి పారాగ్రాఫు చదివేసరికే సంతోషంతో కడుపు నిండిపోయింది. ఈ బ్లాగు చదివితే సంతోషపు అజీర్తి ఖాయం. మీకీ సంగతి తెలిసే బ్లాగుకా పేరెట్టినట్టున్నారు, ఏం?
ReplyDeleteModati paragraph chadivina tarvata chala navvu vachhindi, chala rojula tarvata mana tugo jilla gurtuku vachindi :-)
ReplyDeleteMe language chala baga rasaru, konchem gattiga try cheste Trivikram tarvata meere avutaru ;-)
peerlu chala baga pettaru, nithya varshini(keka).....etc
kaani jeemuthavahanudu ani special ga pettaru ,deeni ardham emiti
భీమపాదంగారి introduction అదిరిపొయింది. సమరసింహా రెడ్డి లొ బాలక్రిష్ణ కి కూడ లేదు ఇంత కత్తిలాంటి entry.
ReplyDeletenayanathaarudi peru chaala bvundi.eemadhyane evarino chusi varshika smitha ani peru pettamu aavida eppudo samvatsaraniki kaani navvadu. alage evi enka chaala bagunnayi
ReplyDeleteMama sahithya sarwabhowma......ne khadalu swyana na mena mama mida rasavu....dhanyavadamulu.....nuvvu annau gane peddala guruchi rayaka pothe vache tharaliki vala gurchi ela thelusthundi?????....XCELLENT JOB
ReplyDelete