Wednesday, December 17, 2008

జీమూతుడు -2

జీమూతవాహన - తాటిముంజల బండి

తప్పిన ఇంజనీరు కథ





నిత్యమామ్మ చేత శాపం పెట్టించుకొని నయనతారుడు, జీముని తాటి ముంజెల బండిపై తొసుకుంటూ దశరధరమయ్య గారింటికి వచ్చెసరికి వాళ్ళ ఇంట్లొ నుండి గావుకేకలు వినపడుతున్నాయి. ఆ కేకలొతొ పాటు ఘంటశాల జనరంజని లొ ఆవేశంగా " ఎవ్వరికొసం ఎవరున్నారు పొండిరా పొండి" అని పాడుతున్నాడు.


తాటి ముంజెల బండి ఆపి "జీము..ఆగు కాసేపు చూద్దాం ఎవరైన కొట్టుకుంటారేమొ" అని నయనతారుడు నాలిక బయట పెట్టుకుంటూ బండి ని ఓ ప్రక్కగా ఆపేశాడు.


దశరధరమయ్య ఇంట్లొ నుండి ఆయన రెండొ కొడుకు లక్ష్మణమూర్తి , ఎర్ర సైన్యం సినిమలొ ఆర్. నారయణమూర్తి ముక్కుపుటాలు ఊగినట్టుగా ఊగిపొతూ బయటకి వస్తూ " ఇంక నీకు నాకు సంభంధం లేదు, నీకు నేను నాకు నువ్వు లేము, ఇప్పుడే ఇల్లెక్కి చాటింపు వేసెస్తా , అని ఎదురుగా ఉన్న తన ఇంటికి నిచ్చెన వేసి ఇల్లెక్కబొయాడు. ఆ ఆవేశం గమనించిన లక్ష్మణమూర్తి భార్య , శ్రవణదర్శిని , "ఎవండొయ్ .. రాత్రి వానకి , ఇంటి పెంకులు తడిసిపొయాయి, ఇప్పుడు మీరు ఇల్లు ఎక్కితే విరిగిపొయాయి, ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కండి , అందరికి వినిపిస్తుంది కూడా " అని నొట్లొని మాట ఎవ్వరికి వినపడకూడదని వాళ్ళ ఆయన చెవిలొ గెట్టిగా చెప్పింది.ఆవిడకి వాళ్ళాయనచేత కొబ్బరి చెట్టు ఎక్కించాలని ఎప్పటి నుండొ కూడా ఉంది




శ్రవణదర్శిని కి "ద్రుశ్యశ్రవణ విద్యా వికాశ కేంద్రం , దూరదర్శన్ , రమాంతపుర్ , హైదరబాదు-13" వాళ్ళు " వినికిడికి పనికిరాని చెవులు" అని ఒక పట్టా కూడా బహుకరించారు. ఈవిడ ఎదుటివాళ్ళ పెదవులని చూసి ఎం మాట్లడారొ తెలుసుకుంటుంది.

"నాకు ఎక్కడం వచ్చే కాని దిగడం రాదు మరి ఎలా" అని లక్ష్మణమూర్తి బేలమొహం పెట్టాడు. మీకన్నా దింపులు తీసే నాగులు గాడే నయం అని మెల్లిగా తనలొ తాను అనుకొబొయి బయటకి అనేసింది శ్రవణదర్శిని. ఆ మాటకి ఒంటికాలిపై లేచి అదే ఎర్ర సైన్యం సినిమలొని ఆర్. నారయణమూర్తి కనుబొమ్మలు ఎగిసిపడ్డట్టు , ఎగురుకుంటూ చెట్టుఎక్కడం మొదలెట్టాడు, లక్ష్మణమూర్తి.


"లక్ష్మణమూర్తొయ్ ... నాకొ కొబ్బరిబొండాం తీసిపెట్టవా నీకొ జీడి ఇస్తాను" అని చెట్టుఎక్కుతున్న లక్ష్మణమూర్తిని అడిగాడు నయనతారుడు. "గాడిద కొడకా ! మొన్న మీ నాన్న , నేను లేకుండా చూసి మూడు కొబ్బరికాయలు తీసుకుపొయాడు, అప్పటి నుండి ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నా , ఇప్పుడు నువ్వు దొరికావు, నేను చాటింపు వేసి నీ పని చెప్తా అక్కడే ఉండు" అని లక్ష్మణమూర్తి అరిచేసరికి నయనతారుడు భయపడి జీముని తొసుకుంటూ ముందుకి కదిలాడు.



వీళ్ళ పక్కనుండి సైకిల్ టైరుని దొర్లించుకుంటూ గాందొళిగాడు దూసుకుంటూ వెళ్ళాడు. గాందొళిగాడు , జీము కి తమ్ముడు వరస అవుతాడు. ఇంట్లొ వీడి అల్లరి భరించలేక, మాస్టారి భయం ఉంటుందని వూరికె బడికి పంపిస్తారు తప్ప, వీడికి చెప్పె మాస్టారు కాని, చెప్పాల్సిన పాఠం కాని అ బడిలొ లేదు.

నయనతారుడు గాందొళిగాడిని చూసి " యెట్రొయ్ బడి లేదా నీకు " అని అడిగాడు. గాందొళిగాడు " మా ఇంట్లొ ఇవాళ్ళ కొత్తావకాయ పెడుతున్నారుగా.. నే రాను " అన్నాడు
నయనతారుడు " నీ టైరు ఒ సారి ఇయ్యవా"
గాందొళిగాడు "ఇవ్వనుపొ"
నయనతారుడు " నీకు బెల్లం జీడి ఇస్తా ఒ మారు ఇయ్యవూ " అని జెబులొ నుండి జీడి తీయబొయెసరికి వాళ్ళ నాన్న సగం కాల్చిన చుట్టముక్క చేతిలొకి వచ్చింది.


అప్పుడే పనికానిచ్చుకొని ఓ చేత్తొ చెంబు, ఒంటి చెత్తొ సైకిల్ తొక్కుతూ వస్తున్న భీమపాదంగారు " ఒరెయ్ !! దిక్కుమాలిన వేధవా, మొన్న సంత నుండి వస్తూ మధ్యలొ జాని గారి చెరువు దెగ్గర ఆగినప్పుడు పొయిందేమొ అని , ఉబ్బుగా వస్తున్నా పొద్దున్నె అంత దూరం వెళ్ళాను, దొరుకుతుందేమొ అని . నీ దెగ్గర ఉందా " అని నయనతారుడి నెత్తి మీద చెంబుతొ కొట్టిపొయాడు.


గుండు మీద రాసుకుంటూ నయనతారుడు వాడి నాన్న లాగే , ఒంటి చేత్తొ తాటిముంజెల బండిని ముందుకు తొసుకుంటూ వెళ్ళుతుంటే, పక్కనే అరుగుమీద పడక్కుర్చిలొ పసుపుపచ్చ పంచ చుట్టుకొని జీడిపప్పు తింటూ " ఒరేయ్ జీము, ఇలా రారా ! నువ్వు బడి నుండి వచ్చెసరికి నేను ఉంటానొ ఉండనొ , ఒ మారు ఇలా రామ్మ " అని రేడియొ లొ లంకేస్వరుడు లొని "పదహారేళ్ళ వయసు పడి పడి లేచె సొగసు" పాట వస్తుండగా పీలగొంతు వేసుకొని పిలిచింది..... పవమానసుతి




పవమానసుతి ,జీముకి అత్తయ్య వరస. భీమపాదం గారికి అక్క, నయనతారుడికి స్వయాన మేనత్త. ఈవిడ , భీష్ముడు, జాంబవంతుడు సమకాలికులు . ఎవరైన పై ఊళ్ళకి వెళ్తుంటె వాళ్ళని పిలిచి ఎప్పుడు తన స్వస్తి వాఖ్యం చెప్తుంది. "ఓరెయ్! నువ్వు మళ్ళీ వచ్చెసరికి ఉంటానొ లేదో "
ఈ మాట విన్నవాళ్ళు దేశవిదేశాలు వెళ్ళొచ్చెసారు కాని ఆవిడ మాత్రం సుపర్ స్టార్ క్రిష్ణ డ్యాన్స్ లా అప్పుడూ ఇప్పుడూ అలనే ఉంది. పవమానం చేప్పేసి మంగళం పాడెయ్యడం అలవాటు కాబట్టి ఈవిడకి పవమానసుతి అని పేరు.



పాపం జీము ఎందుకైన మంచిది అని ఆవిడ దెగ్గరకి వెళ్ళాడు. "ఒరేయ్, జీము ఎన్నాళ్ళయ్యిందిరా నిన్ను చూసి , ఇంద ఈ జీడిపప్పు తీసుకొ , మీ అమ్మకి చెప్పి ఒ కొత్త పంచ పెట్టించరా నాకు, అసలే రేపొ మాపొ పొయెద్దాన్ని " అని అడిగింది. వెంటనే నయనతారుడు, " ఒరేయ్ జీము, రారా బాబు, ఇప్పటికే బడికి ఆలెస్సెం అయిపొయింది" అని జీముని లాక్కొచ్చెసాడు. అత్తొయ్ .. రేపొ మాపొ పొయెదానికి కొత్త పంచెందుకెహె , అయినా నువ్వూ మా పెద్ద మావయ్య "మల్లికార్జున శరావతుడి" గొచి ఎప్పుడు ఊడరెహె. అని అనేసాడు.


"అంట్లవెధవా ! నన్ను శరవతుడి గొచితొ పొలుస్తావట్ర ,అంట్లుతొముకుపొతవ్" అని పక్కనే ఉన్న అట్లకాడని , ఘద లా నయనతారుడి మీదకి విసిరింది....... పవమానసుతి.

ఇంకా ఉందెహె........


నాయనలారా!!! మీరు మళ్ళి వచ్చెసరికి ఉంటానొ పొతానొ. ఈ కధ చదివేసాక , మీ comments వ్రాయడం మర్చిపొకండి. మర్చిపొయారొ, దీనితొ ఒక్కటుచ్చుకుంటా... పవమానసుతి





4 comments:

  1. asalu jeemu badiki veltada leda

    ReplyDelete
  2. జీము "తప్పిన ఇంజినీరు" ఎందుకయ్యాడో అర్ధమవుతోంది. ముందే ఊరి నిండా పెత్తనాలు. ఆ పైన స్కూలుకి వెళ్ళడానికి వాహనం తాటిముంజెల బండి. డ్రైవరు చూస్తే ఎవరు దెబ్బలాడుకుంటారా చూద్దామని గడియకోసారి ఆగిపోయే రకం. గందోళిగాడి ట్రాక్ ఒకటొచ్చి కలిసింది మధ్యలో. ఇంకేం? బ్రహ్మాండంగా ఉంది కథ. కానివ్వండి. మరీ ఊరించకుండా కనీసం రెండ్రోలకో పోస్టు వేస్తే బావుంటుంది.

    ReplyDelete
  3. మల్లికార్జున శెరావతుడి గోచీ ఊడటం కోసం తెగ ఎదురు చూస్తున్నట్టున్నాడే నయనతారుడు? హన్నన్నా.... మీరు సామాన్యులు కారు.

    ReplyDelete
  4. katha lo paristithi batti "Pavamanasuthi" bamma garu maa pillalani kuda kottela unnaru.. aa time lo vachi nenu vyakyanistanu... emantaru...?

    ReplyDelete

Blog Archive


రారండొయ్

stats