Thursday, December 18, 2008

జీమూతుడు -౩.... గొచియొపాఖ్యానం

జీమూతవాహన - తాటిముంజల బండి
తప్పిన ఇంజనీరు కథ





మల్లికార్జున శరావతుడు , నయనతారుడికి పెద్ద మావయ్య , ఈ నాటి మల్లికా శరవత్ కి బట్టలు వేసుకొనే విషయం లొ తాతయ్య అవుతాడు. ఈయన ఇల్లు ఊరికి మొదట్లొ ఉంటుంది. ఊరిలొకి ఎవ్వరు వచ్చినా ముందుగా ఈయన్ని ,గోచీ ని చూసి కాని ఊరిలొపలకి రాలేరు. తిరుపతిలొ వెంకన్న దర్శనం అవుతుందొ లేదొ చివరిదాక అనుమానమే కాని, ఆ అగ్రహారం వచ్చిన వారికి మాత్రం ఈయన తప్పకుండా ఉచిత దర్శనం ఇస్తాడు. మణిరత్నం సినిమా కి వెళ్తే , బాక్సు రాలేదని "మరుగుదొడ్లు వాటి పరిరక్షణ" డాక్యుమెంటరీ చుపెట్టినట్టూ , పిల్లలు గుక్కపెట్టి ఎడుస్తున్నా , చిత్తూరి నాగయ్య నటించిన యొగి వేమన సినిమా ని 3డి లొ చుపించినట్టుగానూ , అగ్రహారం వచ్చిన జనాలకి ఈయన అవతారం చూపించెస్తూ ఉంటాడు.


ఆయన ఇంటి ముందు ఒక నీటి బావి, దాని పక్కనే రొడ్డు కూడ ఎంచక్కా. భక్తులకి ఎక్కువ అలసటలేకుండా ఊరిలొకి వస్తుండగానే, నిలబెట్టెసి, వాళ్ళు తెలిసినా తెలియకపొయినా, ఎవరింటికి వస్తున్నారు? ఎన్నాళ్ళుంటారు? ఏ ఊరినుండి వచ్చారు? ఒక వేళ్ళ పొరపాటున తెలిసిన ఊరు నుండీ వస్తే, ఆ ఊరిలొ , పొగ గొట్టాని ఆనుకొని ఉన్న బడ్డికొట్టు పక్క మూడొ వీధిలొ , ఎడం ప్రక్క నాలుగొ ఇంట్లొ ఉండె బండ్రొతు పాపయ్య ఇంకా ఉన్నాడా? వాడు బతికున్నప్పుడు ఎప్పుడొ ముప్పై యేళ్ళ క్రితం రెండు రూపాయలు తీసుకున్నాడు, ఇప్పటికి వడ్డితొ ఓ యాభై అయ్యుంటుంది, మీరు అక్కడే ఉంటారు కాబట్టి మీరు నాకొ యాభై ఇచ్చేసి, వాళ్ళ ఇంట్లొ నా సంగతి చెప్పి పుచ్చెసుకొండి, అంటూ సబ్బుని అన్ని మూలల్లొకి పంపుతూ, తరవాత కడుక్కుంటూ , వచ్చిన వాళ్ళని కడిగేస్తాడు .

పవమానసుతి,నయనతారుడు గెట్టిగా ... శరావతుడు....., గొచి...... అంటూ అరిచేసరికి , రెండిళ్ళ అవతల ఉన్న, మల్లికార్జున శరావతుడు , చేస్తున్న స్నానం సగం లొ ఆపేసి, , గొచి బిగించుకొని ఆవేశంగా " ఎవడ్రా నా గోచీని అనేది , ఎన్ని తుఫానులు వచ్చినా , మీ కొబ్బరి చెట్లు కొట్టుకు పొతాయెమొ కాని , నాగోచీ మాత్రం పొదురా, సంత మార్కెట్ లొని టీ కొట్టు వాళ్ళు, టీ వడపొయ్యడానికి కావల్సినది నా గోచీ రా, అంతెందుకు, నేను గోచీ కట్టకపొతే ఒక్కడు, ఒక్కడు కూడా, మీ ఇంటి గుమ్మం తొక్కడురా, ఇటునుండి ఇటే పొతారు. మీకొసమే కట్టానురా ఈ గొచీని, " అని ఆవేశంగా నొటికి వచ్చినది అనేసి, ఆగండిరా మడిగా వస్తా అని మరుక్షణం లొ పొడి గోచీ కట్టుకొని, " నా గొచీనే అనేంతటి వారా, అసలు గొచీ అంటే తెలుసా " అని మళ్ళి అరిచి, మనసులొ ఎదొ మంత్రం జపించి తడిగొచీని నయనతారుడు , జీము మీదకి వదిలాడు. అప్పుడే అటువైపుగా సైకిల్ టైరు దొర్లించుకుంటూ వెళ్తున్న గాందొళిగాడు , అది చూసి, గాలిలొ ఒక్క ఉదుటున దూకి , గాలికన్నా వాయువేగంతొ, స్లొ మొషన్లొ, ఆ గొచి జీముకి తగలబొతున్న తరుణంలొ , వాడికి అడ్డు పడ్డాడు. ఆ గొచి గాందొళిగాడికి నెత్తి మీద తగిలి కింద పడిపొయింది. అంతే .. ఒక్క సారిగా గాందొళిగాడికి కళ్ళు బైర్లుకమ్మి,లొకం శూన్యం అయ్యి, ప్రపంచం అంతా గొచీలమయంగా అగుపించించి. ఒక్క సారిగా లేచి పెద్ద పెట్టున 'హే గొచీ ఈ.. ఈ ..ఈ ..ఈ.. ఈ.. ఈ ..ఈ.. ఈ.. ఈ " అని పొలికేక పెట్టి .. భక్తితొ చేతులు జొడించి ఒ పాట అందుకున్నాడు.
ప. జీవము నీవే కదా గోచీ , జీవము నీవే కదా, మొసే భారము నీదే కదా (2)

చ. మనుజులు నీపై కినుక వహించి నిను వదిలింప మదినెంచి
వేసినకాని తీసినకాని. (2) సర్వము నీవే కదా .. గోచీ .. ( జీవము నీవే...2)

చ . భవజలధినిబడి తేలగలేని జీవుల బ్రొచే, గొచివి నీవే
మము కాపాడి మా పిరుదములనే నిలిచియుండువా శ్రితమందార

ప. జీవము నీవే కదా గోచీ , జీవము నీవే కదా, మొసే భారము నీదే కదా ... గోచీ.... ఈ ఈ ఈ ...

అని భావ రాగ తాళయుక్తంగా పాడుతుంటే, బడికి వెళ్ళాల్సిన పిల్లలందరు గాందొళిగాడి చుట్టూ చేరి తన్మయత్వంతొ వాళ్ళు కూడా బౄందంగా గానం చేసారు.




ఆ పాటకి జీముకి కూడా చేతనత్వముకలిగి, ఇద్దరికి తనివి తీరక, చొక్కా విప్పేసి,ఆభేరి రాగం లొ ఎంతో ఆద్రతతొ గోచీ మీద సమ్యుక్తంగా దండకం మొదలెట్టారు.



జై గోచి దేవా , జై స్వేత రూపా నమొ లంబాకార నమొ నిరాకార
బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్ర నిశినన్ నినుధరింపువాడన్,
నీ రూపువర్ణింప నీమీదనే దండకంబొక్కటిచేయ , నీ మూర్తింగాంచి , నీ దయమునెంచి, నిను గొల్చెదన్, నా మొరాలించి నను రక్షించుమున్ , దేవా.. నిన్నెంచ నేనెంతటివాడన్, నా మొలయందు నీవున్న నే సంసారియై స్రుష్ఠి సల్పెదన్.

ద్రుతరాష్ట్రుండు మొలకి , గాంధారి  నిను కనులకి కట్టుకొని  రాజ్యమున్ యేలినారున్  కదా , నిను ధరియించి వామనుండు త్రివిక్రముండయినాడున్ లయకారకుండు మొలయందు నిను అసలు రూపముగను,మెడలొన సర్పరూపంబుగాను ధరియించనాడున్.

శ్రీక్రుష్ణుండు , నిను ధరియించి గొవర్ధనమున్ ఎత్తినాడన్ ,నిను ధరియింపక కీచక,దుర్యొధన,రావణుల్ వొడలువిడిచినారు ,యేసునాధునకు శిలువ మీద ఆధారంబు అయినావు ,వేమన యెమనక నిను ధరించినాడు.

నీవు శైవుల పాలిట విఘ్నేశుండవు, వైష్ణవుల పాలి విశ్వక్శేనుండవే , నిను ధరియింపక వేరు వస్త్రంబులన్ మేము ధరింపజాలము.నీవు మా పాలి తొలి వస్త్రంబువే గాక కడ వస్త్రంబువు కూడ సర్వలొకములన్ ఆబాలగొపాలురన్ స్త్రీపురుషులకున్ నీవే ఆధారంబు,

నీ అనేకరూపముల్ గ్రహించగ నేనెంతటివాడన్,ప్రాలుతాగు పసివారలను డయపరును పేర దయచూపెదవు, లంగొట,లొచెడ్డి, డ్రాయరు,కట్డ్రాయరు యన్నా , వి ఇ పి, డిట్టి ,పూంబుకార్,రూపా యన్నాసహస్రనామముల తిరుగాడేది నీవే, భవిష్యత్ జాకి,హేన్సు ,విక్టొరియా రహస్యంబు నీవే.

నీకున్ నిత్యంస్నానముల్ చేయకున్న మా వంటికిన్ గజ్జియున్ చిడుమున్,తామరయున్ తాపము తీర రప్పించువే,నిను బిగుతుగ కట్టినన్ మాకు అగమ్యగోచరము.అసలు నిన్ను కట్టకున్న గడపన్ దాటనియ్యకుండువే మమ్ము . జానెడే యున్నా జాణల మానముల్ గాపడెదవు

నీ మహత్యంబులన్ గ్రహించి,నిను దర్శించి , శ్ప్రుసించి,ధ్యానించి,ధరించినవారికిన్ సీలైశ్వర్యంబును ప్రసాదించువే , ఒ గోచీ

నమస్తే సదా శూక్ష్మరూప .............................. నమస్తే నిర్వికార............................... .. నమస్తే నమ :
-->
గోచో రక్షతి రక్షిత :





7 comments:

  1. ఇదెక్కడి దారుణము? నాకెంతో ఇష్టమైన పాటని ఇలా పారడీ చేసి ఖూనీ చేస్తారా? వా :-((

    కానీ యే మాటకామాటే చెప్పుకోవాలి. గోచీ దండకం సూపరు :) విక్టోరియా రహస్యంబు నా? :-D కత్తి, కేక.

    ReplyDelete
  2. orinayano gochi gurinchi neeku telisinanta evvariki teliyademo

    ReplyDelete
  3. నాయనా అజీర్తీ, ముందుగా నా అభినందనలు చాలా బాగా వ్రాసినందుకు. చివరిగా మరో సంగతి చెప్పడం మరిచావు. నీకభ్యంతరం లెకుంటే నేను చెప్తాను. ఆ గోచీని చేత చిక్కుంచుకొన్న ఆ గాందొళి గాడు, అదేదో పరమేశ్వరుడు ప్రసాదించిన పాసుపతాశ్త్రము లాగా దాన్ని విడిచి పెట్టక రోజూ ధరిస్తూ, దానితోనె వాల్లింటి పక్కనున్న చెరువులొకి దూకుతూ వుంటే, జనాలు హాహాకారాలు చేస్తూ చెల్లా చెదురుగా పరిగెత్తెవారు. పశు పక్ష్యాదులు సైతం ఆ చుట్టుపక్కలకు వెల్లడానికి భయపడేవి.
    అప్పట్లో ఒకసారి, శరావతుడు నా దగ్గరకొచ్చి, ఆ గొచీ కనిపించట్లేదని, నన్ను అంజనం వేసి చూడమని కూడ అడిగాడు. అయిఎఏ నేనే ఏదో పని కల్పించుకొని తప్పించుకొన్నాను. నేను అంజనం వేసి చూడలేక మాత్రం కాదు సుమా. ఖపడ్దార్!. నేను అంజనం వెసేనంటే ముల్లోకాల్లో ఎక్కడ వున్న గొచీలైనా బయటకు రావల్సిందే!. కానీ, ఆ గొచీ పొయిన తర్వాత కొంపలో కొంచెం కంపు వదిలిందని సంతోషించేను. అది తీసుకెల్లేక గాందొళి గాడింట్లో అత్తరులు కొనడం బాగా పెరిగింది మరి!

    ReplyDelete
  4. ayya rachayita garu me series chadavadam modalu pettinappati nuchi me charcter eppudu vastunda ani chusamu. Maku ee mudo episode lo kani artham kaledu. A gochi me meda padina ventane melo inta vidwathu pravesinhi mimmulani inta krutharthulu ni me talli tandruluni charitarthuluni chestundani aa srusti karta kuda vuhichi vundadu.

    A gochi sparsake melo kavi intalaga vijrumbhiste, inka meru aaaa gochi dhariste!!! Hammo hammo inka emaina vunda?

    ReplyDelete
  5. అజీర్తి గారూ,
    గొచీ గురించి ఇంతల్లా ఆలోచించిన వాల్లు గానీ, 'గొచీ లొని మర్మం' ఇంతల్లా విశదీకరించిన వాల్లు గానీ మరొకరు వుందరంటే అతిశయోక్తి కాదు సుమా..

    ReplyDelete
  6. మిస్టర్ అజీర్తి... "గోచీ తోనే వైరాగ్యం, గొచీ లోనే వైఖుంఠం" అని నమ్మిన మహా మనీషి ఆ శరావతుడు. అలాంటి ఆయన తదనంతరం కుడా నీవు ఆయన 'నామాన్నీ , ముఖ్యంగా ఆయన గొచీని నిలబెడుతున్నందుకు అభినందనలు.. చెబాష్!

    ReplyDelete
  7. గొచీ గురించి చెప్పి జనులలో జాగ్రుతి తెస్తున్నారు. మీకు "గొచీస్ ఆఫ్!". అల నాడు కట్టడానికి ఆ గోచీయె గాంధీ గారికి దొరక్క పొతే...... రౌండ్ టేబుల్ సమావేసం లో ఏమయ్యేదో వూహకే అందదు కదా, ఔరా!!!

    ReplyDelete

Blog Archive


రారండొయ్

stats