Thursday, January 1, 2009

జీమూతుడు - 4 : బొసి మొల - బడికి సెలవు

జీమూతవాహన - తాటిముంజల బండి




తప్పిన ఇంజనీరు కథ





అలా జీము, గాందొళిగాడు , నీళ్ళ విరొచనాల లాగ ఆపకుండా , ఉద్వేగంతొ దండకం చదివేసరికి ఊరు ఊరంతా బిత్తరపొయింది. అంతవరకు చుట్టూ ఉన్న బడి పిల్లలు , గుక్క తిప్పుకొకుండా ఎడుస్తూ, జారుపొతున్న లాగులను ఒ చేత్తొ పట్టుకొని, కంట్లొంచి , ముక్కులొనుండి ధారగా కారిపొతుంటే ఇంకొ చేత్తొ తుడుచుకుంటూ , బతికుంటె గొచి అంచులు కుట్టుకొని అయినా బ్రతకచ్చు అనుకుంటూ చెల్లా చెదురయ్యారు.

కొంతమంది పొట్టలు చేతపట్టి తలొదిక్కుకు పరుగుతీసారు. యేటా వినాయక చవితి సంతర్పణ లొ తినే పనసకాయ ఆవ పెట్టిన కూర, కందా బచ్చలి కూర తిన్నప్పుడు కూడా ఇలా పొట్టలొ కలవర పెట్టలేదనుకుంటూ పెరట్లొకి పరుగులుపెట్టారు. అక్కడే ఉన్న భీమపాదంగారు , చెయూతేకాదు , చెంబూత కూడ ఇస్తాలే పదమని ఆయనకి తోడుగా ఇంకొ ఇద్దరిని తన సైకిలు మీద ఎక్కించుకొని జాని గారి చేరువువైపు వెళ్ళిపొయారు.






జీము, గాందొళిగాడు ఇంకా అదే తన్మయత్వం లొ ఉండేసరికి , ఇంకేమి దండకం చదివి ఇంకొ ఉపద్రవం తీసుకొని వస్తారొ అని అశరీరవాణి, ఎడ్లబండిని తొలే సత్తిగాడి రూపం లొ ప్రత్యక్షం అయ్యి "ఓవ్ ...ఓవ్ ... ఓవ్....ఆగెహె" అని పలికింది. అప్పటికి కాని ఆ మాలొకాలు ఈ లొకంలొకి రాలేదు.

అంతవరకు రొడ్డు మీద ఒ ప్రక్కగా ఒబ్బిడిగా తాగేసి కొట్టుకుంటున్న మల్లికార్ఝున శరవతుడి ఇద్దరు బాబయ్యలు లవుడు, కుశుడు , వీళ్ళు చదివిన దండకం ధాటికి తట్టుకొలేక, ఆ ప్రక్కనే ఉన్న నీళ్ళ బావిలొ దూకి తనివితీరక అ బావిలొ కూడ కొట్టుకొసాగారు . వాళ్ళు ఆ సమయములొ చేసిన పనివల్ల , మున్ముందు వాళ్ళ చరితం దిక్ దిగంతాలు వ్యాపిస్తుందని కాని, ఏ అన్నదమ్ములు కొట్టుకున్నా , వీళ్ళనే తలచుకుంటారని కాని, తిట్టడానికి వీళ్ళ పేర్లని మించిన తిట్టు మరేమి ఉండదని వారికి తెలియదు.

ఒ ప్రక్క శరవాతుడు కన్నీళ్ళ పర్యంతం అయ్యి " నాయనలార, గొచియె సర్వము గొచీలొనే వైకుంఠంబు అని నమ్మిన వాడిని. నాకు తప్ప వేరే వారికి దాని ప్రాముఖ్యత తెలియదన్న అజ్ఞనాంధకారం లొ ఇన్నాళ్ళు కొట్టుమిట్టులాడాను. మీరు నా కళ్ళు , గొచీ తెరిపించారు. మిమ్మలని అ గొచేస్వరుడు సర్వదా కాపడతాడు . కాని జీము , తెలిసొ తెలియకొ నువ్వు పరొక్షంగా నయనతారుడితొ కలిసి ముందుగా నన్ను హేళన చేశావు. వాడికి సొంతంగా గొచి అనేదే ఉండదు. ఎప్పుడూ ప్రక్కవాడి గొచీలె వాడికి దిక్కు, నీకు పదిహెనొ ఏట వరకు వేరేవాళ్ళవి వాడతావు తప్ప నావి అనుకొడానికి నీకు ఒక్క గొచీ కూడ ఉండదు. ఆ తరువాత నీకు పుష్కలంగా, నీకు సొంతంగా , నీవి అనుకొనేలా , దేశ విదేశాల గొచీలు లభిస్తాయి" అని శాపాలు పెట్టెసి తన గొచి ఆరేసుకొడానికి వెళ్ళిపొయాడు.

ఇంకో ప్రక్క నయనతారుడికి కళ్ళు బయర్లు కమ్మి రెండు గుడ్లు తేలేసి బయట పెట్టి నీరసం వచ్చి ఒ మూలగా కూలబడ్డాడు. అంతలొ , పారిపొయిన బడిపిల్లలొ ఒకడు కసితీరక , ఆ వీధికి అవతల వైపు చెరువు ప్రక్కగా ఉండే గాండొళిగాడి ఇంటికి వెళ్ళి వాడి తండ్రితొ "మీ వాడు శరవతుడి గొచి పీకెశాడండి" అని చెప్పెసాడు. గాండొళిగాడి త్రండ్రి "దూర్వాశ మూర్తి", ఈయనకి ప్రధమ కొపమే కాదు. , ద్వితీయ , త్రుతీయ , చతుర్ది ....ఎకాదశ ద్వాదశ.. అష్టాదశ కొపాలూ ఉన్నాయి. ఈయనకి కొపం వచ్చిందంటే చాలు, బడి పిల్లలు ఈయన ఇంటిపక్కన ఉన్న చెరువు దెగ్గర కాపు కాసెస్తారు, ఎ వస్తువు పడెస్తారా అని. దూర్వాశం గారికి కొపం వస్తే అందుబాటులొ ఉన్న వస్తువు పక్కనె ఉన్న చెరువులొకి విసిరెస్తారు. ఒ సారి అలానే రుబ్బురొలు పడేసేసరికి బడి పిల్లలు అది పట్టుకుపొయి మధ్యాహ్న భొజన పధకంలొ కంది పచ్చడి కొసం వాడేసుకున్నారు.

గాండొళిగాడి గురించి చెప్పెసరికి దూర్వాశంగారు ఆవేశంగా అ వీధి చివరకి వెళ్ళి గాందొళిగాడి జబ్బ పట్టుకొని ఇంటికి బర బరా ఈడ్చుకొచ్చి, వీధి తలుపు వేసేసి ధభా ధభా అని వీపు మీద వాయించెసారు .



ఈ రొజు గొచీ పీకాడు, రేపు ఇంకెవరివి ఎమేమి పీకుతాడొ అని వాడిని హైదరబాదులొ ఉన్న వాడి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించెయ్యడానికి సిద్దం అయ్యారు.

అక్కడ... నయనతారుడి మీద నీళ్ళు జల్లి లేపబొతుంటే, మర్చిపొయిన చెంబుకొసం భీమపాదం గారు అటువైపుగా వచ్చి " నీళ్ళు కాదు , సొడాకాయ ఇస్తే కాని వాడు లేవడు, వాడిది మా నాన్న పోలిక ...తెలుసట్రా " అని జీముతొ అనేసి, బావి ప్రక్కనె ఉన్న శరవతుడి చెంబు పట్టుకొని సైకిలెక్కి పొయారు.

కొంత సేపటికి నయనతారుడు తేరుకొని మళ్ళి జీముని తొసుకుంటూ బయలుదేరాడు. ఉన్న నీరసం తీరడానికి కాలవ పక్కన ఉన్న చిన్న ఉసిరికాయలు కొన్ని కోసుకొని తింటూ ముందుకి వెళ్తుంటె జీముడికి తన మేనత్త మొగుడు అయిన ఉగ్రతాండవం గారు ముక్కుపొడెం పీలుస్తూ ఎవరినొ తిడుతూ కనిపించారు. కూరగాయల కాపు బెరుకు బెరుకుగా , పాలు అనుకొని కరక్కాయ రసం తాగిన పిల్లిలా మొహంపెట్టి ఉగ్రతాండవం గారిని చూస్తున్నాడు. ఇదేమి పట్టనట్టు కురగాయల కాపుకి "మూల సంఖా , దాని వల్ల జరిగె అనర్ధాలు , శారీరక మార్పులు , అది వచ్చేముందు , వచ్చాక ఎం తినాలి , ఎన్ని పూటలు తినాలి, కూర్చొడానికి పడుకొడానికి మాత్రమే కాక వెళ్ళడానికి ఏ భంగిమ సుఖప్రదంగా ఉంటుందీ, వెళ్ళేటప్పుడు ఏ దిక్కులొ కూర్చొవాలి, వాస్తు శకునం లాంటివి చూడాలా, మంత్రాలకి తగ్గిపొతుందా లేక మస్తాన్ చేత కొయించుకొవాలా, ఇంట్లొ ఇద్దరికి పైగా మూలశంఖ ఉంటే ప్రభుత్వ రాయితీ ఎమైన ఉంటుందా, అరవై పైబడిన వారికి పించను గట్రా మరియు ప్రయాణ ఖర్చులొ తగ్గింపు ఉంటుందా" అంటూ మూలసంఖ వల్ల వచ్చే లాభాలు, నష్టాల గురించి గుక్క తిప్పుకోకుండా , వినేవాళ్ళని కూడ ఎదీ తిప్పుకొనివ్వకుండా ఉగ్రతాండవం గారు వినిపించేస్తున్నారు . వినకపొతే ఆ కూరగాయల కాపుని నానా విధ పుత్ర నామాలతొ జాడించేస్తున్నారు . ఆయనకి తెలిసిన అందరి కొడుకులని ఒక సమూహారంగ మలచి, వాటికి ఇంకొన్ని పదాలు చేకూర్చి , ఎంతో వైవిద్య భరితంగా... ఆ కొడక.. ఈ కొడకా అని పుత్ర సహస్రనామం చదువుతున్నారు. క్రొత్తగా వినేవారికి అవి బూతులే కావచ్చు, కాని ఆయన ప్రతీ సంభొదనలొనూ ఆప్యాయతతో కూడిన ఒక 'కొడుకు' తప్పకుండా ఉంటాడు.

అలాంటి పరిస్తితిలొ ఆయన్ని ఎవ్వరు పలకరించరు, కాని జీముకి తన పేరులొ ఆయన పేరు కూడ ఉండటం వల్ల కలిగిన ధైర్యం చేతనొ లేక, గొచేస్వరుడి వరప్రభావముచేతనో , అయన దెగ్గరకి వెళ్ళి " మావయ్య నీ ముక్కుపొడెం డబ్బా ఇయ్యవా, నా బలపాలు, కణికలు అందులొ పెట్టుకుంటాను" అని అడిగాడు.
పుత్ర సహస్రనామం చదువుతూ , మాంచి నిష్ఠా గరిష్ఠతతొ ఉన్న ఉగ్రతాండవం గారికి జీము అడిగిన కొరికతొ అరికాలి మంట ముక్కుకి ఎక్కింది. చిక్కంలొ నుండి ముక్కుపొడెం డబ్బా తీసి, అందులొనుండి కొంచెం పొడి తీసి , పీల్చి, తాజాగా మళ్ళి ఓ సారి ముక్కు చీదీ , జీము వైపు ఆయన కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు చూపిస్తూ " ఈ రెండు వేళ్ళకి అట్టకట్టుకొని పొయి ఉన్న ముక్కుపొడికి ఉన్నంత వయసు లేదు నీకు, నన్నే ముక్కుపొడి డబ్బా అడుగుతావట్రా , తత్తుకొడకా , పొయిన అట్లతద్దికి మీ అత్తయ్య కూడ మీ ఇంటికి వస్తే , ఆరు గజాల పంచ కాకుండా బండార్లంక లుంగి పెడతారా నాకు , ఇంద ఇది ఉంచుకొ " అని అ రెండు వేళ్ళని జీము లాగుకి తుడిచేసారు . అప్పుడే యమగొల లొ 'ఒలమ్మి తిక్కరేగిందా " పాట మొదలయ్యింది

ఉగ్రతాండవం గారు చేసిన పనికి జీముకి తిక్కరేగింది. రెండు గంగా బొండాలు ఆయన నెత్తి మీద పడేయ్యాలన్న కసి, కొబ్బరి మట్టతొ ఆయన నడ్డి మీద ఒక్కటిచ్చుకొవాలన్న కొపము కలిగాయి . కాని వయసు సహకరించదని గ్రహించి, అంతకుముందే , ఆ ఊరి అభిమాన వీరభద్ర సినిమా హాలులొ లొ చూసినట్టుగా, కొపం వచ్చినప్పుడు ద్రౌపతి లా జడ విప్పాలన్నా, లేక చాణిక్యుడిలా పిలక విప్పాలన్నా రెండు లేవు కాబట్టి వేసుకున్న లాగు ఇప్పేసి, తాటిముంజెల బండి ఎక్కి నయనతారుడితొ " ఈ బొడి మొలతొ బడికి వెళ్ళేది లేదు, ఇంటికి పొనీయ్ " అని గదమాయించాడు.

అంతవరకు పెళ్ళి నడకలా, నత్తనడకలా నడిపించిన బండిని రెండు అంగల్లొ జీము ఇంటిముందు తీసుకొచ్చెసాడు నయనతారుడు. బండి దిగి జీము ఇంట్లొ కి వెళ్ళకుండా వాకిట్లొనే , చేత్తో లాగు పట్టుకొని నిల్చున్నాడు. అప్పుడే జనరంజనిలొ "చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన , కరకంకణములు గలగల లాడగా" అని పాట వస్తొండగా ఇంట్లొ నుండి పదేళ్ళ వయసున్న జీము చిన్నక్క ఇంట్లొ నుండి బయటకి వస్తొంది.

సావిట్లొ నుండి జీము చిన్నక్క, మేఘగర్జని , అప్పుడే కాల్చిన పనసపిక్కలు ఊదుకుంటూ తింటూ " అమ్మా ! సాయంత్రం పొట్టెక్కబుట్టలు వండవా , అందులొకి ఉల్లి ఆవకాయ బాగుంటుంది" అని అంటూ వీధిలొకి చూసింది. శ్రవణబెళగొల లొ గొమటేశ్వరుడిలాగ బొసి మొలతొ నిల్చున్న జీముని చూస్తూనే " అమ్మ వీడు బడిలొ ఎదో వెధవ పని చేసినట్టున్నాడే , కడుక్కొడానికి వచ్చినట్టున్నాడు" అని అనేసి " ఏరా పిడత వెధవా !! పొద్దున్న బడికి వెళ్ళెముందు నా రెండు గౌనులు కుట్టించమని 'సొడా బుడ్డిగాడికి' ఇవ్వమని చెప్పాను కదా, ఇక్కడే వదిలేసిపొయావు. అందుకే నా శాపం నీకు తగిలి వెంటనె బడినుండి వచ్చెసావు. ఏరా నా రెండు గౌనులు కుట్టించలేని వాడివి, బడికెళ్ళి ఇంకేం చదువుతావు? నీకు చదువు ఎలా వస్తుంది? చదివినా అది నీ చచ్చుబుర్రకి ఏం ఎక్కుతుందిరా? ఆ నయనతారుడి లాగే సంకనాకిపొతావ్. అక్కడే నిల్చుండిపొయావేం , తిండి ఎక్కువ అయ్యిందా ? బడిలొ వెళ్ళినవాడివి, కడుక్కొడానికి ఇంటిదాక రావక్కర్లేదు, మాస్టారి చేత కడిగించుకొవచ్చుగా , ఆయన రొజు మన తొటలొ ఆనపకాయలు పట్టుకెళ్తారు . ఎక్కువసేపు నిల్చుంటే ఎండిపొతుంది వెధవాయ్, పెరట్లొకి వెళ్ళి కడుక్కొ, ఒరేయ్ నయనగా , వాడికి కాస్త నీళ్ళుపొయ్యి" అని బడిలొ రెండొ ఎక్కం అప్పచెప్పినట్టుగా అనేసి , ఒ పనసగింజని ఊదుకుంటూ నొట్లొ వేసుకుంది.

అలా మేఘగర్జని, కరుణానిధి తమిళ ఉపన్యాసంలా , ఆవేశంగా తిట్టెసరికి జీముకి కొంత సేపు , పక్కలొ ఓ యాభై తాటాకు టపకాయలు పేలినట్టూ, ఉగ్రతాండవం నెత్తి మీద పడెయ్యాలనుకొన్న రెండు గంగా బొండాలు వీడి నెత్తి మీద పడ్డట్టుగానూ, తొడమీద పది దుర్గాణి చీమలు కుట్టినట్టుగా అనిపించి, ఓ రెండు క్షణాలు బ్రహ్మదేవుడిలా వాడి బుర్ర నాలుగు దిక్కులా తిరిగి చెవిలొనుండి , రేడియొ లొ ప్రసారాలు అయిపొయాకా వచ్చే కూతల లాగ.....కుయ్య్ ..య్ ..య్...య్...య్....అన్న శబ్దం తప్ప ఇంకేమి వినపడలేదు.



ఇంకా ఉందోచ్...


Monday, December 22, 2008

అవుటి బెల్లు

ఒకటో అవుటి బెల్లు



పాపం మీకు కాస్త విరామం ఇద్దామని ఈ అవుటి బెల్లు ...

ఎదో సెర్చ్ చేస్తూ ఊరికే అజీర్తి అని కొడితే , ఎదో సైట్ లొ ఇలా కనపడింది.
మరి నా బ్లొగ్ కి తక్కువ నొక్కులు నొక్కారు దర్మార్గులు. మరి దారుణం కదండి.
1 వారాలు, 0 నొక్కులు, 2 వ్యాఖ్యలు , 1 వారాలు, 0 నొక్కులు, 4 వ్యాఖ్యలు, 4 రోజులు, 0 నొక్కులు, 4 వ్యాఖ్యలు , 3 రోజులు, 0 నొక్కులు, 2 వ్యాఖ్యలు.
అన్ని వారలు నిండినా ఒక్క నొక్కుడూ లేదంటే మరి నెలలు నిండెసరికి నొప్పులు ఎలా వస్తాయి ? చదివే వాళ్ళు చదివేసిపొతున్నారు .. ఆ.. మనకి ఎందుకులే , వీడు రాసినది చదవడమె ఎక్కువ. పైగా వీడి రాతకి కామెంట్లు కూడాను అని ఒకరు అనుకుంటే, ఆ.. ఎవడో ఒకడు రాయకపొతాడా , మనకి ఎందుకులే అని ఇంకొళ్ళు అనుకుంటారు.
అసలు నిజం చెప్పలంటె ఇలాంటి వాళ్ళ వల్లె ముంబాయి లొ అలా అయ్యింది , ఎవడికి వాడు మనకి ఎందుకులే అనుకొబట్టే , ఎవడొ ఒకడు చెస్తాడులే అని అనుకొబట్టే ముంబాయిలొ అలా అయ్యింది.
కాబట్టి , చెప్పేది ఎంటంటే, భాద్యత యెరిగి ఎవరి నొక్కుళ్ళు వారు నొక్కాలి

నొక్కండెహే.......


http://www.bhalira.com/bhalira/LinqServlet?Action=SearchByCat&gadgetView=blogView&clickCount=0&sourceLink=http://ajeerthi.blogspot.కం

0/0.0 జీమూతుడు -౩.... గొచియొపాఖ్యానం - (వ్యాస్మీకి)
( 3 రోజులు, 0 నొక్కులు, 2 వ్యాఖ్యలు)
0/0.0 జీమూతుడు -2 - (వ్యాస్మీకి)
( 4 రోజులు, 0 నొక్కులు, 4 వ్యాఖ్యలు)
0/0.0 జీముతుడు -1 - (వ్యాస్మీకి)
( 1 వారాలు, 0 నొక్కులు, 4 వ్యాఖ్యలు)
0/0.0 ఉపొద్ఘాతం - (వ్యాస్మీకి)
( 1 వారాలు, 0 నొక్కులు, 2 వ్యాఖ్యలు)
0/0.0 ajeerthi - (5 టపాలు)
( 1 మాసాలు, 0 నొక్కులు)



Thursday, December 18, 2008

జీమూతుడు -౩.... గొచియొపాఖ్యానం

జీమూతవాహన - తాటిముంజల బండి
తప్పిన ఇంజనీరు కథ





మల్లికార్జున శరావతుడు , నయనతారుడికి పెద్ద మావయ్య , ఈ నాటి మల్లికా శరవత్ కి బట్టలు వేసుకొనే విషయం లొ తాతయ్య అవుతాడు. ఈయన ఇల్లు ఊరికి మొదట్లొ ఉంటుంది. ఊరిలొకి ఎవ్వరు వచ్చినా ముందుగా ఈయన్ని ,గోచీ ని చూసి కాని ఊరిలొపలకి రాలేరు. తిరుపతిలొ వెంకన్న దర్శనం అవుతుందొ లేదొ చివరిదాక అనుమానమే కాని, ఆ అగ్రహారం వచ్చిన వారికి మాత్రం ఈయన తప్పకుండా ఉచిత దర్శనం ఇస్తాడు. మణిరత్నం సినిమా కి వెళ్తే , బాక్సు రాలేదని "మరుగుదొడ్లు వాటి పరిరక్షణ" డాక్యుమెంటరీ చుపెట్టినట్టూ , పిల్లలు గుక్కపెట్టి ఎడుస్తున్నా , చిత్తూరి నాగయ్య నటించిన యొగి వేమన సినిమా ని 3డి లొ చుపించినట్టుగానూ , అగ్రహారం వచ్చిన జనాలకి ఈయన అవతారం చూపించెస్తూ ఉంటాడు.


ఆయన ఇంటి ముందు ఒక నీటి బావి, దాని పక్కనే రొడ్డు కూడ ఎంచక్కా. భక్తులకి ఎక్కువ అలసటలేకుండా ఊరిలొకి వస్తుండగానే, నిలబెట్టెసి, వాళ్ళు తెలిసినా తెలియకపొయినా, ఎవరింటికి వస్తున్నారు? ఎన్నాళ్ళుంటారు? ఏ ఊరినుండి వచ్చారు? ఒక వేళ్ళ పొరపాటున తెలిసిన ఊరు నుండీ వస్తే, ఆ ఊరిలొ , పొగ గొట్టాని ఆనుకొని ఉన్న బడ్డికొట్టు పక్క మూడొ వీధిలొ , ఎడం ప్రక్క నాలుగొ ఇంట్లొ ఉండె బండ్రొతు పాపయ్య ఇంకా ఉన్నాడా? వాడు బతికున్నప్పుడు ఎప్పుడొ ముప్పై యేళ్ళ క్రితం రెండు రూపాయలు తీసుకున్నాడు, ఇప్పటికి వడ్డితొ ఓ యాభై అయ్యుంటుంది, మీరు అక్కడే ఉంటారు కాబట్టి మీరు నాకొ యాభై ఇచ్చేసి, వాళ్ళ ఇంట్లొ నా సంగతి చెప్పి పుచ్చెసుకొండి, అంటూ సబ్బుని అన్ని మూలల్లొకి పంపుతూ, తరవాత కడుక్కుంటూ , వచ్చిన వాళ్ళని కడిగేస్తాడు .

పవమానసుతి,నయనతారుడు గెట్టిగా ... శరావతుడు....., గొచి...... అంటూ అరిచేసరికి , రెండిళ్ళ అవతల ఉన్న, మల్లికార్జున శరావతుడు , చేస్తున్న స్నానం సగం లొ ఆపేసి, , గొచి బిగించుకొని ఆవేశంగా " ఎవడ్రా నా గోచీని అనేది , ఎన్ని తుఫానులు వచ్చినా , మీ కొబ్బరి చెట్లు కొట్టుకు పొతాయెమొ కాని , నాగోచీ మాత్రం పొదురా, సంత మార్కెట్ లొని టీ కొట్టు వాళ్ళు, టీ వడపొయ్యడానికి కావల్సినది నా గోచీ రా, అంతెందుకు, నేను గోచీ కట్టకపొతే ఒక్కడు, ఒక్కడు కూడా, మీ ఇంటి గుమ్మం తొక్కడురా, ఇటునుండి ఇటే పొతారు. మీకొసమే కట్టానురా ఈ గొచీని, " అని ఆవేశంగా నొటికి వచ్చినది అనేసి, ఆగండిరా మడిగా వస్తా అని మరుక్షణం లొ పొడి గోచీ కట్టుకొని, " నా గొచీనే అనేంతటి వారా, అసలు గొచీ అంటే తెలుసా " అని మళ్ళి అరిచి, మనసులొ ఎదొ మంత్రం జపించి తడిగొచీని నయనతారుడు , జీము మీదకి వదిలాడు. అప్పుడే అటువైపుగా సైకిల్ టైరు దొర్లించుకుంటూ వెళ్తున్న గాందొళిగాడు , అది చూసి, గాలిలొ ఒక్క ఉదుటున దూకి , గాలికన్నా వాయువేగంతొ, స్లొ మొషన్లొ, ఆ గొచి జీముకి తగలబొతున్న తరుణంలొ , వాడికి అడ్డు పడ్డాడు. ఆ గొచి గాందొళిగాడికి నెత్తి మీద తగిలి కింద పడిపొయింది. అంతే .. ఒక్క సారిగా గాందొళిగాడికి కళ్ళు బైర్లుకమ్మి,లొకం శూన్యం అయ్యి, ప్రపంచం అంతా గొచీలమయంగా అగుపించించి. ఒక్క సారిగా లేచి పెద్ద పెట్టున 'హే గొచీ ఈ.. ఈ ..ఈ ..ఈ.. ఈ.. ఈ ..ఈ.. ఈ.. ఈ " అని పొలికేక పెట్టి .. భక్తితొ చేతులు జొడించి ఒ పాట అందుకున్నాడు.
ప. జీవము నీవే కదా గోచీ , జీవము నీవే కదా, మొసే భారము నీదే కదా (2)

చ. మనుజులు నీపై కినుక వహించి నిను వదిలింప మదినెంచి
వేసినకాని తీసినకాని. (2) సర్వము నీవే కదా .. గోచీ .. ( జీవము నీవే...2)

చ . భవజలధినిబడి తేలగలేని జీవుల బ్రొచే, గొచివి నీవే
మము కాపాడి మా పిరుదములనే నిలిచియుండువా శ్రితమందార

ప. జీవము నీవే కదా గోచీ , జీవము నీవే కదా, మొసే భారము నీదే కదా ... గోచీ.... ఈ ఈ ఈ ...

అని భావ రాగ తాళయుక్తంగా పాడుతుంటే, బడికి వెళ్ళాల్సిన పిల్లలందరు గాందొళిగాడి చుట్టూ చేరి తన్మయత్వంతొ వాళ్ళు కూడా బౄందంగా గానం చేసారు.




ఆ పాటకి జీముకి కూడా చేతనత్వముకలిగి, ఇద్దరికి తనివి తీరక, చొక్కా విప్పేసి,ఆభేరి రాగం లొ ఎంతో ఆద్రతతొ గోచీ మీద సమ్యుక్తంగా దండకం మొదలెట్టారు.



జై గోచి దేవా , జై స్వేత రూపా నమొ లంబాకార నమొ నిరాకార
బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్ర నిశినన్ నినుధరింపువాడన్,
నీ రూపువర్ణింప నీమీదనే దండకంబొక్కటిచేయ , నీ మూర్తింగాంచి , నీ దయమునెంచి, నిను గొల్చెదన్, నా మొరాలించి నను రక్షించుమున్ , దేవా.. నిన్నెంచ నేనెంతటివాడన్, నా మొలయందు నీవున్న నే సంసారియై స్రుష్ఠి సల్పెదన్.

ద్రుతరాష్ట్రుండు మొలకి , గాంధారి  నిను కనులకి కట్టుకొని  రాజ్యమున్ యేలినారున్  కదా , నిను ధరియించి వామనుండు త్రివిక్రముండయినాడున్ లయకారకుండు మొలయందు నిను అసలు రూపముగను,మెడలొన సర్పరూపంబుగాను ధరియించనాడున్.

శ్రీక్రుష్ణుండు , నిను ధరియించి గొవర్ధనమున్ ఎత్తినాడన్ ,నిను ధరియింపక కీచక,దుర్యొధన,రావణుల్ వొడలువిడిచినారు ,యేసునాధునకు శిలువ మీద ఆధారంబు అయినావు ,వేమన యెమనక నిను ధరించినాడు.

నీవు శైవుల పాలిట విఘ్నేశుండవు, వైష్ణవుల పాలి విశ్వక్శేనుండవే , నిను ధరియింపక వేరు వస్త్రంబులన్ మేము ధరింపజాలము.నీవు మా పాలి తొలి వస్త్రంబువే గాక కడ వస్త్రంబువు కూడ సర్వలొకములన్ ఆబాలగొపాలురన్ స్త్రీపురుషులకున్ నీవే ఆధారంబు,

నీ అనేకరూపముల్ గ్రహించగ నేనెంతటివాడన్,ప్రాలుతాగు పసివారలను డయపరును పేర దయచూపెదవు, లంగొట,లొచెడ్డి, డ్రాయరు,కట్డ్రాయరు యన్నా , వి ఇ పి, డిట్టి ,పూంబుకార్,రూపా యన్నాసహస్రనామముల తిరుగాడేది నీవే, భవిష్యత్ జాకి,హేన్సు ,విక్టొరియా రహస్యంబు నీవే.

నీకున్ నిత్యంస్నానముల్ చేయకున్న మా వంటికిన్ గజ్జియున్ చిడుమున్,తామరయున్ తాపము తీర రప్పించువే,నిను బిగుతుగ కట్టినన్ మాకు అగమ్యగోచరము.అసలు నిన్ను కట్టకున్న గడపన్ దాటనియ్యకుండువే మమ్ము . జానెడే యున్నా జాణల మానముల్ గాపడెదవు

నీ మహత్యంబులన్ గ్రహించి,నిను దర్శించి , శ్ప్రుసించి,ధ్యానించి,ధరించినవారికిన్ సీలైశ్వర్యంబును ప్రసాదించువే , ఒ గోచీ

నమస్తే సదా శూక్ష్మరూప .............................. నమస్తే నిర్వికార............................... .. నమస్తే నమ :
-->
గోచో రక్షతి రక్షిత :





Wednesday, December 17, 2008

జీమూతుడు -2

జీమూతవాహన - తాటిముంజల బండి

తప్పిన ఇంజనీరు కథ





నిత్యమామ్మ చేత శాపం పెట్టించుకొని నయనతారుడు, జీముని తాటి ముంజెల బండిపై తొసుకుంటూ దశరధరమయ్య గారింటికి వచ్చెసరికి వాళ్ళ ఇంట్లొ నుండి గావుకేకలు వినపడుతున్నాయి. ఆ కేకలొతొ పాటు ఘంటశాల జనరంజని లొ ఆవేశంగా " ఎవ్వరికొసం ఎవరున్నారు పొండిరా పొండి" అని పాడుతున్నాడు.


తాటి ముంజెల బండి ఆపి "జీము..ఆగు కాసేపు చూద్దాం ఎవరైన కొట్టుకుంటారేమొ" అని నయనతారుడు నాలిక బయట పెట్టుకుంటూ బండి ని ఓ ప్రక్కగా ఆపేశాడు.


దశరధరమయ్య ఇంట్లొ నుండి ఆయన రెండొ కొడుకు లక్ష్మణమూర్తి , ఎర్ర సైన్యం సినిమలొ ఆర్. నారయణమూర్తి ముక్కుపుటాలు ఊగినట్టుగా ఊగిపొతూ బయటకి వస్తూ " ఇంక నీకు నాకు సంభంధం లేదు, నీకు నేను నాకు నువ్వు లేము, ఇప్పుడే ఇల్లెక్కి చాటింపు వేసెస్తా , అని ఎదురుగా ఉన్న తన ఇంటికి నిచ్చెన వేసి ఇల్లెక్కబొయాడు. ఆ ఆవేశం గమనించిన లక్ష్మణమూర్తి భార్య , శ్రవణదర్శిని , "ఎవండొయ్ .. రాత్రి వానకి , ఇంటి పెంకులు తడిసిపొయాయి, ఇప్పుడు మీరు ఇల్లు ఎక్కితే విరిగిపొయాయి, ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కండి , అందరికి వినిపిస్తుంది కూడా " అని నొట్లొని మాట ఎవ్వరికి వినపడకూడదని వాళ్ళ ఆయన చెవిలొ గెట్టిగా చెప్పింది.ఆవిడకి వాళ్ళాయనచేత కొబ్బరి చెట్టు ఎక్కించాలని ఎప్పటి నుండొ కూడా ఉంది




శ్రవణదర్శిని కి "ద్రుశ్యశ్రవణ విద్యా వికాశ కేంద్రం , దూరదర్శన్ , రమాంతపుర్ , హైదరబాదు-13" వాళ్ళు " వినికిడికి పనికిరాని చెవులు" అని ఒక పట్టా కూడా బహుకరించారు. ఈవిడ ఎదుటివాళ్ళ పెదవులని చూసి ఎం మాట్లడారొ తెలుసుకుంటుంది.

"నాకు ఎక్కడం వచ్చే కాని దిగడం రాదు మరి ఎలా" అని లక్ష్మణమూర్తి బేలమొహం పెట్టాడు. మీకన్నా దింపులు తీసే నాగులు గాడే నయం అని మెల్లిగా తనలొ తాను అనుకొబొయి బయటకి అనేసింది శ్రవణదర్శిని. ఆ మాటకి ఒంటికాలిపై లేచి అదే ఎర్ర సైన్యం సినిమలొని ఆర్. నారయణమూర్తి కనుబొమ్మలు ఎగిసిపడ్డట్టు , ఎగురుకుంటూ చెట్టుఎక్కడం మొదలెట్టాడు, లక్ష్మణమూర్తి.


"లక్ష్మణమూర్తొయ్ ... నాకొ కొబ్బరిబొండాం తీసిపెట్టవా నీకొ జీడి ఇస్తాను" అని చెట్టుఎక్కుతున్న లక్ష్మణమూర్తిని అడిగాడు నయనతారుడు. "గాడిద కొడకా ! మొన్న మీ నాన్న , నేను లేకుండా చూసి మూడు కొబ్బరికాయలు తీసుకుపొయాడు, అప్పటి నుండి ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నా , ఇప్పుడు నువ్వు దొరికావు, నేను చాటింపు వేసి నీ పని చెప్తా అక్కడే ఉండు" అని లక్ష్మణమూర్తి అరిచేసరికి నయనతారుడు భయపడి జీముని తొసుకుంటూ ముందుకి కదిలాడు.



వీళ్ళ పక్కనుండి సైకిల్ టైరుని దొర్లించుకుంటూ గాందొళిగాడు దూసుకుంటూ వెళ్ళాడు. గాందొళిగాడు , జీము కి తమ్ముడు వరస అవుతాడు. ఇంట్లొ వీడి అల్లరి భరించలేక, మాస్టారి భయం ఉంటుందని వూరికె బడికి పంపిస్తారు తప్ప, వీడికి చెప్పె మాస్టారు కాని, చెప్పాల్సిన పాఠం కాని అ బడిలొ లేదు.

నయనతారుడు గాందొళిగాడిని చూసి " యెట్రొయ్ బడి లేదా నీకు " అని అడిగాడు. గాందొళిగాడు " మా ఇంట్లొ ఇవాళ్ళ కొత్తావకాయ పెడుతున్నారుగా.. నే రాను " అన్నాడు
నయనతారుడు " నీ టైరు ఒ సారి ఇయ్యవా"
గాందొళిగాడు "ఇవ్వనుపొ"
నయనతారుడు " నీకు బెల్లం జీడి ఇస్తా ఒ మారు ఇయ్యవూ " అని జెబులొ నుండి జీడి తీయబొయెసరికి వాళ్ళ నాన్న సగం కాల్చిన చుట్టముక్క చేతిలొకి వచ్చింది.


అప్పుడే పనికానిచ్చుకొని ఓ చేత్తొ చెంబు, ఒంటి చెత్తొ సైకిల్ తొక్కుతూ వస్తున్న భీమపాదంగారు " ఒరెయ్ !! దిక్కుమాలిన వేధవా, మొన్న సంత నుండి వస్తూ మధ్యలొ జాని గారి చెరువు దెగ్గర ఆగినప్పుడు పొయిందేమొ అని , ఉబ్బుగా వస్తున్నా పొద్దున్నె అంత దూరం వెళ్ళాను, దొరుకుతుందేమొ అని . నీ దెగ్గర ఉందా " అని నయనతారుడి నెత్తి మీద చెంబుతొ కొట్టిపొయాడు.


గుండు మీద రాసుకుంటూ నయనతారుడు వాడి నాన్న లాగే , ఒంటి చేత్తొ తాటిముంజెల బండిని ముందుకు తొసుకుంటూ వెళ్ళుతుంటే, పక్కనే అరుగుమీద పడక్కుర్చిలొ పసుపుపచ్చ పంచ చుట్టుకొని జీడిపప్పు తింటూ " ఒరేయ్ జీము, ఇలా రారా ! నువ్వు బడి నుండి వచ్చెసరికి నేను ఉంటానొ ఉండనొ , ఒ మారు ఇలా రామ్మ " అని రేడియొ లొ లంకేస్వరుడు లొని "పదహారేళ్ళ వయసు పడి పడి లేచె సొగసు" పాట వస్తుండగా పీలగొంతు వేసుకొని పిలిచింది..... పవమానసుతి




పవమానసుతి ,జీముకి అత్తయ్య వరస. భీమపాదం గారికి అక్క, నయనతారుడికి స్వయాన మేనత్త. ఈవిడ , భీష్ముడు, జాంబవంతుడు సమకాలికులు . ఎవరైన పై ఊళ్ళకి వెళ్తుంటె వాళ్ళని పిలిచి ఎప్పుడు తన స్వస్తి వాఖ్యం చెప్తుంది. "ఓరెయ్! నువ్వు మళ్ళీ వచ్చెసరికి ఉంటానొ లేదో "
ఈ మాట విన్నవాళ్ళు దేశవిదేశాలు వెళ్ళొచ్చెసారు కాని ఆవిడ మాత్రం సుపర్ స్టార్ క్రిష్ణ డ్యాన్స్ లా అప్పుడూ ఇప్పుడూ అలనే ఉంది. పవమానం చేప్పేసి మంగళం పాడెయ్యడం అలవాటు కాబట్టి ఈవిడకి పవమానసుతి అని పేరు.



పాపం జీము ఎందుకైన మంచిది అని ఆవిడ దెగ్గరకి వెళ్ళాడు. "ఒరేయ్, జీము ఎన్నాళ్ళయ్యిందిరా నిన్ను చూసి , ఇంద ఈ జీడిపప్పు తీసుకొ , మీ అమ్మకి చెప్పి ఒ కొత్త పంచ పెట్టించరా నాకు, అసలే రేపొ మాపొ పొయెద్దాన్ని " అని అడిగింది. వెంటనే నయనతారుడు, " ఒరేయ్ జీము, రారా బాబు, ఇప్పటికే బడికి ఆలెస్సెం అయిపొయింది" అని జీముని లాక్కొచ్చెసాడు. అత్తొయ్ .. రేపొ మాపొ పొయెదానికి కొత్త పంచెందుకెహె , అయినా నువ్వూ మా పెద్ద మావయ్య "మల్లికార్జున శరావతుడి" గొచి ఎప్పుడు ఊడరెహె. అని అనేసాడు.


"అంట్లవెధవా ! నన్ను శరవతుడి గొచితొ పొలుస్తావట్ర ,అంట్లుతొముకుపొతవ్" అని పక్కనే ఉన్న అట్లకాడని , ఘద లా నయనతారుడి మీదకి విసిరింది....... పవమానసుతి.

ఇంకా ఉందెహె........


నాయనలారా!!! మీరు మళ్ళి వచ్చెసరికి ఉంటానొ పొతానొ. ఈ కధ చదివేసాక , మీ comments వ్రాయడం మర్చిపొకండి. మర్చిపొయారొ, దీనితొ ఒక్కటుచ్చుకుంటా... పవమానసుతి





Saturday, December 13, 2008

జీముతుడు -1

-->

జీమూతవాహన - తాటిముంజల బండి
--> తప్పిన ఇంజనీరు కథ


కొనసీమ లొని ఒక కుగ్రామం. అందులొ ఒక అగ్రహరం. అవి ఎంత అందమైన రొజులు అంటే , పని వాళ్ళు పని అయ్యకా  డబ్బులకు బదులు ఆవకాయ ముక్కొ లేక టీ చుక్కొ అడిగే రొజులు . చేపలు,రొయ్యలు అమ్ముకొనెవాళ్ళు , అగ్రహారం పొలిమెరలొ ఉన్న కాపుల పాలెం వచ్చెదాకా వాళ్ళ సైకిల్ ఆపకుండా,అరవకుండాపొయె రొజులు.

రొజు ఊరంతా సందడిగా ఉంది. కారణం, ఊరి గారాల పట్టి, ముద్దు బిడ్డ అయిన జీమూతవాహనుడు పై చదువులకి ఊరు విడిచి వెళ్ళె రొజు. అందరు ముద్దుగా జీము అని పిలుచుకుంటారు. జీముతుడి అసలు పేరు ఉగ్రతాండవ నాగ జీమూతవాహన కుమార్. ఉగ్రతాండవం అనేది జీము కి మేనత్త మొగుడి పేరు. ఆయన బతికున్నప్పుడు ఊరి జనాల మీద తాండవం చెసేవాడు. జీము కూడ అలానే తాండవం చెయ్యాలని పేరు కలిపారు,


ఇప్పటికి అదే పేరు ఉండేది, కానీ ఒక రొజున..................... ఫ్లాష్ బ్యాక్



అప్పుడు జీము ఒకటొ తరగతి చదివే రొజులు.. రొజు బడికి బయలుదేరాడు . ఇంటి నుండి బడికి పది అంగల్లొ వెళ్ళిపొవచ్చు కాని జీముడికి తన ఊరి వాళ్ళంటె వల్లమాలిన అభిమానం. అందరిని పలకరించి కాని బడికి వెళ్ళడు.


వాళ్ళ ఇంటిపక్కన ఉండే చిన్నమ్మడక్క గారి ఇంటికి వెళ్ళి ఆవిడ పెట్టె బెల్లం టీ రొజు త్రాగితె కాని పాఠం తలకి ఎక్కదు. జీము వాళ్ళ ఇంటికి టీ కి వెళ్తె చాలు , సావిట్లొ ఉన్న స్తంభం పక్క పట్టెమంచం ఖాళి చెయ్యల్సిందే. పట్టెమంచం మీద కాళ్ళు ఎత్తిపెట్టి , స్తంభానికి ఆనుకొని టీ తాగితే కాని బడికి వెళ్ళడు.



రొజు కూడ టీ తాగేసి ఇంటి బయటకి రాగానే ఎదురుగా "నయనతారుడు" తాటి ముంజెల బండి తొసుకుంటూ వచ్చాడు. జీముని చూస్తూనే "తొందరగా ఎక్కెహే , బడికి టయాం అయిపొతొంది" అని తొందరపెట్టాడు. నయనతారుడు జీముకి వేలు విడిచిన పెదనాన్న కొడుకు , అంటే అన్నయ్య అవుతాడు, రెండెళ్ళు పెద్ద.. ఆకాశం లొ నక్షత్రాలలా విసిరెసినట్టుగా వీడి కళ్ళు ఎటెటొ ఉంటాయి కాబట్టి వీడికి నయనతారుడు అని వాళ్ళ నాన్న భీమపాదుడు గారు ఏరికొరి పెట్టారు. భీమపాదం గారికి వొంట్లొ అన్నిటికన్న పాదాలు భలంగా ఉంటాయని పేరు. .......... సరే, అసలు విషయానికి వద్దాం ...

జీము రొజులాగే తాటి ముంజెల మధ్యలొ ఉన్న కొబ్బరి కమ్మ మీద కూర్చొగానే , నయనతారుడు బండిని తొసుకుంటూ ముందుకు సాగాడు . ఎదురుగా ఎడ్ల బండి తొలుకుంటూ సత్తిగాడు, జీము బండిని చూడగానె ఎడ్లని పక్కన ఆపేసి, తలపాగ తీసుకొని చెతిలొ పెట్టుకొని, " రొడ్డుకి మూలగా వెళ్ళొద్దండి అబ్బయ్ గారు , అక్కడ బాలేదు " అని అన్నాడు. అంతలొ నయనతారుడు, మాకు తెలుసులే, అని విసురుగా బండిని తొయసాగడు. రెండు అడుగులు వేసేసరికి "టీపొడి" శంకర్రావు ఇంటి నుండి రేడియొలొ జనరంజని లొ " తెల్లా తెల్లని చీరలొన చందమామా పట్టాపగలు వచ్చినావె చందమామ" అన్న పాట మొదలయ్యింది. అది వినగానే, నయనతారుడు, పాటకి తగ్గట్టుగా ఈల వేయసాగాడు. అంతలొ వాళ్ళకి ఎదురుగా నిండుగా తెల్ల పంచ కట్టుకున్న జీముడి చిన్న నాయనమ్మ "నిత్య వర్షిణి" వస్తూ వీళ్ళని చూసి రొడ్డుకి పక్కగా ఆగిపొయింది. ఆవిడని అందరు నిత్య మామ్మ అని పిలుచుకుంటారు. ఈవిడని కదిపితె కంట్లొ లేకపొతె ముక్కు కారిపొతుంది , అందుకే నిత్యవర్షిణి అని ఈవిడకి పేరు.



నిత్యమామ్మ వీళ్ళని చూసి " ఒరేయ్ నయనగా బండి కొంచెం అస్సింట తొలు, పక్కన అంతా అశుద్దాలు ఉన్నయ్ రా " అని గెట్ఠిగా జలుబు ముక్కుతొ అరిచింది. అరుపుకి నయనతారుడికి కొపం వచ్చి " నువ్వేటెహె నాకు చెప్పెది" అని అనేసాడు. వీడితొ ఎందుకులే అనుకొని " సరేలే , నయనగా ! చెరువు గట్టు దాక వెళ్తున్నవు కదా , అక్కడ మంగలి చింతన్న ఉంటే కాస్త రమ్మన్నా అని చెప్పు. నేను పెరట్లొ ఉంటాను , చెప్తావు కదరా , నీకు కొన్ని అటుకులు పెడతాలె నాయనా" అని బతిమలాడింది. అసలే నిత్యమామ్మ మీద కొపంగా ఉన్న నయనతారుడు " నేను చెప్పను , నేను జీముడిని బళ్ళొ దిగెట్టెసి , మా నాన్న కూడ నందంపుడి వెళ్ళాలి, జమిందారు గారి మనవరాలు సవత్తాడింది , భొంజెయ్యడానికి వెళ్ళలెహె" అని ఆవేశంగా బండితొసుకుంటూ పొయాడు. వెంటనె నిత్యమామ్మ " అలానే వెళ్ళు , మీ నాన్న కూడ తిరిగి అడుక్కుతినిపొతావ్" అని శపించింది

"ఏమే పిన్ని ! ఎవడే అడుక్కుతినేది, సారి మా ఇంటికి పుల్ల మజ్జిక్కి వస్తావు కదా అప్పుడు నీ టొపెరం లెగ్గొడతా" అని గెట్టిగా వినపడేసరికి నెత్తి మీద పంచ సర్దుకొని ఎవరూ అన్నట్టుగా చూసింది నిత్యమామ్మ. నయనతారుడి నాన్న భీమపాదం ఒక చేత్తొ చెంబు పట్టుకొని ఒంటి చేత్తొ సైకిల్ తొక్కుతూ ఆవేశంగా తిట్టేసిపొయాడు. పొద్దున్నే వీడి శకునం ఎంట్రా దేవుడా, పైగా దొడ్డి చెంబూ వీడునూ అని నిత్యమామ్మ కాసెపు అక్కడే నిల్చొని , జనరంజని లొ "నీ దారి పూల దారి పొవొయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ద్వనించు విజయ భేరి" పాట వస్తుండగా , మంచి శకునం రాగానె పుల్ల మజ్జిగకొసం సారి భీమపాదం ఇంటికి కాకుండా , జీముడి ఇంటి వైపు మళ్ళింది
-->
అయిపొలేదు..
-->
-->
వూరికేచదివేసి window ని close చెయ్యకుండా , comments రాయాల్సిందిగా మనవి






అజీర్తి

Blog Archive


రారండొయ్

stats