Thursday, January 1, 2009

జీమూతుడు - 4 : బొసి మొల - బడికి సెలవు

జీమూతవాహన - తాటిముంజల బండి




తప్పిన ఇంజనీరు కథ





అలా జీము, గాందొళిగాడు , నీళ్ళ విరొచనాల లాగ ఆపకుండా , ఉద్వేగంతొ దండకం చదివేసరికి ఊరు ఊరంతా బిత్తరపొయింది. అంతవరకు చుట్టూ ఉన్న బడి పిల్లలు , గుక్క తిప్పుకొకుండా ఎడుస్తూ, జారుపొతున్న లాగులను ఒ చేత్తొ పట్టుకొని, కంట్లొంచి , ముక్కులొనుండి ధారగా కారిపొతుంటే ఇంకొ చేత్తొ తుడుచుకుంటూ , బతికుంటె గొచి అంచులు కుట్టుకొని అయినా బ్రతకచ్చు అనుకుంటూ చెల్లా చెదురయ్యారు.

కొంతమంది పొట్టలు చేతపట్టి తలొదిక్కుకు పరుగుతీసారు. యేటా వినాయక చవితి సంతర్పణ లొ తినే పనసకాయ ఆవ పెట్టిన కూర, కందా బచ్చలి కూర తిన్నప్పుడు కూడా ఇలా పొట్టలొ కలవర పెట్టలేదనుకుంటూ పెరట్లొకి పరుగులుపెట్టారు. అక్కడే ఉన్న భీమపాదంగారు , చెయూతేకాదు , చెంబూత కూడ ఇస్తాలే పదమని ఆయనకి తోడుగా ఇంకొ ఇద్దరిని తన సైకిలు మీద ఎక్కించుకొని జాని గారి చేరువువైపు వెళ్ళిపొయారు.






జీము, గాందొళిగాడు ఇంకా అదే తన్మయత్వం లొ ఉండేసరికి , ఇంకేమి దండకం చదివి ఇంకొ ఉపద్రవం తీసుకొని వస్తారొ అని అశరీరవాణి, ఎడ్లబండిని తొలే సత్తిగాడి రూపం లొ ప్రత్యక్షం అయ్యి "ఓవ్ ...ఓవ్ ... ఓవ్....ఆగెహె" అని పలికింది. అప్పటికి కాని ఆ మాలొకాలు ఈ లొకంలొకి రాలేదు.

అంతవరకు రొడ్డు మీద ఒ ప్రక్కగా ఒబ్బిడిగా తాగేసి కొట్టుకుంటున్న మల్లికార్ఝున శరవతుడి ఇద్దరు బాబయ్యలు లవుడు, కుశుడు , వీళ్ళు చదివిన దండకం ధాటికి తట్టుకొలేక, ఆ ప్రక్కనే ఉన్న నీళ్ళ బావిలొ దూకి తనివితీరక అ బావిలొ కూడ కొట్టుకొసాగారు . వాళ్ళు ఆ సమయములొ చేసిన పనివల్ల , మున్ముందు వాళ్ళ చరితం దిక్ దిగంతాలు వ్యాపిస్తుందని కాని, ఏ అన్నదమ్ములు కొట్టుకున్నా , వీళ్ళనే తలచుకుంటారని కాని, తిట్టడానికి వీళ్ళ పేర్లని మించిన తిట్టు మరేమి ఉండదని వారికి తెలియదు.

ఒ ప్రక్క శరవాతుడు కన్నీళ్ళ పర్యంతం అయ్యి " నాయనలార, గొచియె సర్వము గొచీలొనే వైకుంఠంబు అని నమ్మిన వాడిని. నాకు తప్ప వేరే వారికి దాని ప్రాముఖ్యత తెలియదన్న అజ్ఞనాంధకారం లొ ఇన్నాళ్ళు కొట్టుమిట్టులాడాను. మీరు నా కళ్ళు , గొచీ తెరిపించారు. మిమ్మలని అ గొచేస్వరుడు సర్వదా కాపడతాడు . కాని జీము , తెలిసొ తెలియకొ నువ్వు పరొక్షంగా నయనతారుడితొ కలిసి ముందుగా నన్ను హేళన చేశావు. వాడికి సొంతంగా గొచి అనేదే ఉండదు. ఎప్పుడూ ప్రక్కవాడి గొచీలె వాడికి దిక్కు, నీకు పదిహెనొ ఏట వరకు వేరేవాళ్ళవి వాడతావు తప్ప నావి అనుకొడానికి నీకు ఒక్క గొచీ కూడ ఉండదు. ఆ తరువాత నీకు పుష్కలంగా, నీకు సొంతంగా , నీవి అనుకొనేలా , దేశ విదేశాల గొచీలు లభిస్తాయి" అని శాపాలు పెట్టెసి తన గొచి ఆరేసుకొడానికి వెళ్ళిపొయాడు.

ఇంకో ప్రక్క నయనతారుడికి కళ్ళు బయర్లు కమ్మి రెండు గుడ్లు తేలేసి బయట పెట్టి నీరసం వచ్చి ఒ మూలగా కూలబడ్డాడు. అంతలొ , పారిపొయిన బడిపిల్లలొ ఒకడు కసితీరక , ఆ వీధికి అవతల వైపు చెరువు ప్రక్కగా ఉండే గాండొళిగాడి ఇంటికి వెళ్ళి వాడి తండ్రితొ "మీ వాడు శరవతుడి గొచి పీకెశాడండి" అని చెప్పెసాడు. గాండొళిగాడి త్రండ్రి "దూర్వాశ మూర్తి", ఈయనకి ప్రధమ కొపమే కాదు. , ద్వితీయ , త్రుతీయ , చతుర్ది ....ఎకాదశ ద్వాదశ.. అష్టాదశ కొపాలూ ఉన్నాయి. ఈయనకి కొపం వచ్చిందంటే చాలు, బడి పిల్లలు ఈయన ఇంటిపక్కన ఉన్న చెరువు దెగ్గర కాపు కాసెస్తారు, ఎ వస్తువు పడెస్తారా అని. దూర్వాశం గారికి కొపం వస్తే అందుబాటులొ ఉన్న వస్తువు పక్కనె ఉన్న చెరువులొకి విసిరెస్తారు. ఒ సారి అలానే రుబ్బురొలు పడేసేసరికి బడి పిల్లలు అది పట్టుకుపొయి మధ్యాహ్న భొజన పధకంలొ కంది పచ్చడి కొసం వాడేసుకున్నారు.

గాండొళిగాడి గురించి చెప్పెసరికి దూర్వాశంగారు ఆవేశంగా అ వీధి చివరకి వెళ్ళి గాందొళిగాడి జబ్బ పట్టుకొని ఇంటికి బర బరా ఈడ్చుకొచ్చి, వీధి తలుపు వేసేసి ధభా ధభా అని వీపు మీద వాయించెసారు .



ఈ రొజు గొచీ పీకాడు, రేపు ఇంకెవరివి ఎమేమి పీకుతాడొ అని వాడిని హైదరబాదులొ ఉన్న వాడి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించెయ్యడానికి సిద్దం అయ్యారు.

అక్కడ... నయనతారుడి మీద నీళ్ళు జల్లి లేపబొతుంటే, మర్చిపొయిన చెంబుకొసం భీమపాదం గారు అటువైపుగా వచ్చి " నీళ్ళు కాదు , సొడాకాయ ఇస్తే కాని వాడు లేవడు, వాడిది మా నాన్న పోలిక ...తెలుసట్రా " అని జీముతొ అనేసి, బావి ప్రక్కనె ఉన్న శరవతుడి చెంబు పట్టుకొని సైకిలెక్కి పొయారు.

కొంత సేపటికి నయనతారుడు తేరుకొని మళ్ళి జీముని తొసుకుంటూ బయలుదేరాడు. ఉన్న నీరసం తీరడానికి కాలవ పక్కన ఉన్న చిన్న ఉసిరికాయలు కొన్ని కోసుకొని తింటూ ముందుకి వెళ్తుంటె జీముడికి తన మేనత్త మొగుడు అయిన ఉగ్రతాండవం గారు ముక్కుపొడెం పీలుస్తూ ఎవరినొ తిడుతూ కనిపించారు. కూరగాయల కాపు బెరుకు బెరుకుగా , పాలు అనుకొని కరక్కాయ రసం తాగిన పిల్లిలా మొహంపెట్టి ఉగ్రతాండవం గారిని చూస్తున్నాడు. ఇదేమి పట్టనట్టు కురగాయల కాపుకి "మూల సంఖా , దాని వల్ల జరిగె అనర్ధాలు , శారీరక మార్పులు , అది వచ్చేముందు , వచ్చాక ఎం తినాలి , ఎన్ని పూటలు తినాలి, కూర్చొడానికి పడుకొడానికి మాత్రమే కాక వెళ్ళడానికి ఏ భంగిమ సుఖప్రదంగా ఉంటుందీ, వెళ్ళేటప్పుడు ఏ దిక్కులొ కూర్చొవాలి, వాస్తు శకునం లాంటివి చూడాలా, మంత్రాలకి తగ్గిపొతుందా లేక మస్తాన్ చేత కొయించుకొవాలా, ఇంట్లొ ఇద్దరికి పైగా మూలశంఖ ఉంటే ప్రభుత్వ రాయితీ ఎమైన ఉంటుందా, అరవై పైబడిన వారికి పించను గట్రా మరియు ప్రయాణ ఖర్చులొ తగ్గింపు ఉంటుందా" అంటూ మూలసంఖ వల్ల వచ్చే లాభాలు, నష్టాల గురించి గుక్క తిప్పుకోకుండా , వినేవాళ్ళని కూడ ఎదీ తిప్పుకొనివ్వకుండా ఉగ్రతాండవం గారు వినిపించేస్తున్నారు . వినకపొతే ఆ కూరగాయల కాపుని నానా విధ పుత్ర నామాలతొ జాడించేస్తున్నారు . ఆయనకి తెలిసిన అందరి కొడుకులని ఒక సమూహారంగ మలచి, వాటికి ఇంకొన్ని పదాలు చేకూర్చి , ఎంతో వైవిద్య భరితంగా... ఆ కొడక.. ఈ కొడకా అని పుత్ర సహస్రనామం చదువుతున్నారు. క్రొత్తగా వినేవారికి అవి బూతులే కావచ్చు, కాని ఆయన ప్రతీ సంభొదనలొనూ ఆప్యాయతతో కూడిన ఒక 'కొడుకు' తప్పకుండా ఉంటాడు.

అలాంటి పరిస్తితిలొ ఆయన్ని ఎవ్వరు పలకరించరు, కాని జీముకి తన పేరులొ ఆయన పేరు కూడ ఉండటం వల్ల కలిగిన ధైర్యం చేతనొ లేక, గొచేస్వరుడి వరప్రభావముచేతనో , అయన దెగ్గరకి వెళ్ళి " మావయ్య నీ ముక్కుపొడెం డబ్బా ఇయ్యవా, నా బలపాలు, కణికలు అందులొ పెట్టుకుంటాను" అని అడిగాడు.
పుత్ర సహస్రనామం చదువుతూ , మాంచి నిష్ఠా గరిష్ఠతతొ ఉన్న ఉగ్రతాండవం గారికి జీము అడిగిన కొరికతొ అరికాలి మంట ముక్కుకి ఎక్కింది. చిక్కంలొ నుండి ముక్కుపొడెం డబ్బా తీసి, అందులొనుండి కొంచెం పొడి తీసి , పీల్చి, తాజాగా మళ్ళి ఓ సారి ముక్కు చీదీ , జీము వైపు ఆయన కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు చూపిస్తూ " ఈ రెండు వేళ్ళకి అట్టకట్టుకొని పొయి ఉన్న ముక్కుపొడికి ఉన్నంత వయసు లేదు నీకు, నన్నే ముక్కుపొడి డబ్బా అడుగుతావట్రా , తత్తుకొడకా , పొయిన అట్లతద్దికి మీ అత్తయ్య కూడ మీ ఇంటికి వస్తే , ఆరు గజాల పంచ కాకుండా బండార్లంక లుంగి పెడతారా నాకు , ఇంద ఇది ఉంచుకొ " అని అ రెండు వేళ్ళని జీము లాగుకి తుడిచేసారు . అప్పుడే యమగొల లొ 'ఒలమ్మి తిక్కరేగిందా " పాట మొదలయ్యింది

ఉగ్రతాండవం గారు చేసిన పనికి జీముకి తిక్కరేగింది. రెండు గంగా బొండాలు ఆయన నెత్తి మీద పడేయ్యాలన్న కసి, కొబ్బరి మట్టతొ ఆయన నడ్డి మీద ఒక్కటిచ్చుకొవాలన్న కొపము కలిగాయి . కాని వయసు సహకరించదని గ్రహించి, అంతకుముందే , ఆ ఊరి అభిమాన వీరభద్ర సినిమా హాలులొ లొ చూసినట్టుగా, కొపం వచ్చినప్పుడు ద్రౌపతి లా జడ విప్పాలన్నా, లేక చాణిక్యుడిలా పిలక విప్పాలన్నా రెండు లేవు కాబట్టి వేసుకున్న లాగు ఇప్పేసి, తాటిముంజెల బండి ఎక్కి నయనతారుడితొ " ఈ బొడి మొలతొ బడికి వెళ్ళేది లేదు, ఇంటికి పొనీయ్ " అని గదమాయించాడు.

అంతవరకు పెళ్ళి నడకలా, నత్తనడకలా నడిపించిన బండిని రెండు అంగల్లొ జీము ఇంటిముందు తీసుకొచ్చెసాడు నయనతారుడు. బండి దిగి జీము ఇంట్లొ కి వెళ్ళకుండా వాకిట్లొనే , చేత్తో లాగు పట్టుకొని నిల్చున్నాడు. అప్పుడే జనరంజనిలొ "చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన , కరకంకణములు గలగల లాడగా" అని పాట వస్తొండగా ఇంట్లొ నుండి పదేళ్ళ వయసున్న జీము చిన్నక్క ఇంట్లొ నుండి బయటకి వస్తొంది.

సావిట్లొ నుండి జీము చిన్నక్క, మేఘగర్జని , అప్పుడే కాల్చిన పనసపిక్కలు ఊదుకుంటూ తింటూ " అమ్మా ! సాయంత్రం పొట్టెక్కబుట్టలు వండవా , అందులొకి ఉల్లి ఆవకాయ బాగుంటుంది" అని అంటూ వీధిలొకి చూసింది. శ్రవణబెళగొల లొ గొమటేశ్వరుడిలాగ బొసి మొలతొ నిల్చున్న జీముని చూస్తూనే " అమ్మ వీడు బడిలొ ఎదో వెధవ పని చేసినట్టున్నాడే , కడుక్కొడానికి వచ్చినట్టున్నాడు" అని అనేసి " ఏరా పిడత వెధవా !! పొద్దున్న బడికి వెళ్ళెముందు నా రెండు గౌనులు కుట్టించమని 'సొడా బుడ్డిగాడికి' ఇవ్వమని చెప్పాను కదా, ఇక్కడే వదిలేసిపొయావు. అందుకే నా శాపం నీకు తగిలి వెంటనె బడినుండి వచ్చెసావు. ఏరా నా రెండు గౌనులు కుట్టించలేని వాడివి, బడికెళ్ళి ఇంకేం చదువుతావు? నీకు చదువు ఎలా వస్తుంది? చదివినా అది నీ చచ్చుబుర్రకి ఏం ఎక్కుతుందిరా? ఆ నయనతారుడి లాగే సంకనాకిపొతావ్. అక్కడే నిల్చుండిపొయావేం , తిండి ఎక్కువ అయ్యిందా ? బడిలొ వెళ్ళినవాడివి, కడుక్కొడానికి ఇంటిదాక రావక్కర్లేదు, మాస్టారి చేత కడిగించుకొవచ్చుగా , ఆయన రొజు మన తొటలొ ఆనపకాయలు పట్టుకెళ్తారు . ఎక్కువసేపు నిల్చుంటే ఎండిపొతుంది వెధవాయ్, పెరట్లొకి వెళ్ళి కడుక్కొ, ఒరేయ్ నయనగా , వాడికి కాస్త నీళ్ళుపొయ్యి" అని బడిలొ రెండొ ఎక్కం అప్పచెప్పినట్టుగా అనేసి , ఒ పనసగింజని ఊదుకుంటూ నొట్లొ వేసుకుంది.

అలా మేఘగర్జని, కరుణానిధి తమిళ ఉపన్యాసంలా , ఆవేశంగా తిట్టెసరికి జీముకి కొంత సేపు , పక్కలొ ఓ యాభై తాటాకు టపకాయలు పేలినట్టూ, ఉగ్రతాండవం నెత్తి మీద పడెయ్యాలనుకొన్న రెండు గంగా బొండాలు వీడి నెత్తి మీద పడ్డట్టుగానూ, తొడమీద పది దుర్గాణి చీమలు కుట్టినట్టుగా అనిపించి, ఓ రెండు క్షణాలు బ్రహ్మదేవుడిలా వాడి బుర్ర నాలుగు దిక్కులా తిరిగి చెవిలొనుండి , రేడియొ లొ ప్రసారాలు అయిపొయాకా వచ్చే కూతల లాగ.....కుయ్య్ ..య్ ..య్...య్...య్....అన్న శబ్దం తప్ప ఇంకేమి వినపడలేదు.



ఇంకా ఉందోచ్...


1 comment:

  1. పనసకాయ ఆవ పెట్టిన కూర, కందా-బచ్చలి కూర, దూర్వాస మూర్తి గారి ప్రథమ, ద్వితీయ, అష్టాదశ కోపాలు, మధ్యాన్న భోజన పథకంలో కంది పచ్చడి, కాలవ పక్కన చిన్న ఉసిరికాయలు, కూరగాయల కాపు, పాలనుకుని కరక్కాయ రసం తాగిన పిల్లి మొహం, పుత్రనామాలు, ముక్కుపొడుం డబ్బాలో బలపాలు, కణికలు, బండార్లంక లుంగీ, గంగా బొండాలు, కాల్చిన పనస పిక్కలు, పొట్టెక్కబుట్టలు, పిడత వెధవా, దుర్గాణి చీమలు..... కోనసీమకి ఇన్ని సిగ్నేచరులున్నాయని నాకిప్పుడే తెలిసింది. జయహో.

    ReplyDelete

Blog Archive


రారండొయ్

stats