Wednesday, December 10, 2008

ఉపొద్ఘాతం



వాల్మీకి అసలు రామాయణం రాయకపొతే? వ్యాస మహర్షి వినాయకుడి చేత మహభారతం వ్రాయించకపొతే? కాంగ్రెసు, భాజపా మధ్య రామ సేతు కొట్లాటలు ఉండేవి కాదుగాని, అసలు దేశానికి మన పురాణాలు వాటి గొప్పతనాలు, పక్కవాడి పెళ్ళాన్ని లేపుకుపొవడాలు, సినిమా వాళ్ళు వాచిపొయెటట్టు తొడలు కొట్టుకొడాలు వగైరాలు తెలిసెవి కావు.


పెద్దలు అప్పుడు వ్రాయబట్టే, నేను ఇప్పుడు వ్రాస్తున్నా.


నాకూ తెలిసిన కొంతమంది అవతార పురుషుల గురించి వ్రాయకపొతే, ముందు తారానికి వీళ్ళ గురించి ఏలా తెలుస్తుంది??????? ప్రశ్న వింటేనే భయం కలుగుతొంది కదా?


వానతొ పూర్తిగా తడిసిపొయిన కొబ్బరి తొటలొ జుర్రున జారిపొతున్నట్టుగా ఉంది కదా?


బారెడు జడలొ నుండి కస్టపడి తీసిన పేను వేళ్ళ సందులొ నుండి పడిపొయినట్టుగా ఉందా?


హరిదాసు నెత్తిమీద బియ్యం వెయ్యబొతూ, గొబ్బెమ్మని తొక్కెసినట్టుగా ఉందా?


భయపడకండి, , వీళ్ళ చరితం మీకు అందిస్తా




వ్యాస్మీకి

Blog Archive


రారండొయ్

stats